twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తనకు తాను ఫ్రెంచ్ హాలిడేస్ ప్రకటించుకొన్న కాజల్..!

    By Sindhu
    |

    తెలుగులో దాదాపు టాప్ స్ధాయికి చేరుకున్నహాట్ హీరోయిన్ కాజల్ త్వరలో ప్యారిస్ వెళ్ళనుంది. అయితే ఈ ట్రిప్ షూటింగ్ కోసం కాదట...విశ్రాంతి కోసమని చెప్తోంది.ఆమె మాట్లాడుతూ... వరుస సినిమాలతో అలసిపోయాను. నాలుగేళ్లలో 21 సినిమాల్లో నటించాను. ఎక్కడా విరామం తీసుకోలేదు. మనసు, శరీరం కాస్త విశ్రాంతి కోరుకొంటున్నాయి. ఎక్కడా గ్యాప్ లేకపోవడంతో టీన్ అయిపోయి, లైఫ్ బోర్ కొట్టేస్తోంది. అందుకే, ఇప్పుడు వీలుచూసుకుని, ఓ వారం రోజుల పాటు నా స్నేహితులతో కలిసి పారిస్‌ వెళ్తున్నాను. ఒక వారం అక్కడ ఆనందంగా గడిపి మరో ఏడాది షూటింగ్ లలో పాల్గొనడానికి అవసరమైన శక్తిని నింపుకొని వస్తాను అంది.

    అలాగే ఇటీవల నేను నటించిన 'సింగం' సినిమా బాలీవుడ్‌లో మంచి పేరు తీసుకొచ్చింది. హిందీ అవకాశాలు చాలానే వస్తున్నాయిగానీ ప్రస్తుతానికి ఏవీ ఒప్పుకోలేదు. తెలుగులో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో మహేష్‌ బాబు సరసన 'ది బిజినెస్‌ మేన్‌' చిత్రాన్ని అంగీకరించాను. 'సింగం'తో విజయాన్ని అందుకొన్న తరవాత విహార యాత్రకు వెళ్లడం మరింత ఆనందాన్నిస్తోందని చెప్పుకొచ్చింది. ఇక ఆమె రీసెంట్ చిత్రం 'దడ' భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

    English summary
    Kajal Aggarwal has gifted herself a long holiday. Now that Singham has released, the South actress who has made a foot hold in Bollywood wants to take a breather and relax. Exhausted after the long weeks of promotions pre and post release, she has taken off to Paris with a bunch of close friends.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X