Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
హాట్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డా.. అలా కట్ చేస్తే ఎలా? తెగ ఫీలైపోతున్న కాజల్
దశాబ్ద కాలంగా వెండితెరపై హవా సాగిస్తోంది పంజాబీ బ్యూటీ కాజల్ అగర్వాల్. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ ఇప్పటికే హాఫ్ సెంచరీ కొట్టేసి ముందుకు సాగుతోంది. నేటి అప్‌కమింగ్ హీరోయిన్లను మించిన అందం ఈమె సొంతం కాబట్టి క్రేజీ హీరోయిన్గా మారిన కాజల్.. మరికొద్ది రోజుల్లో 'క్వీన్' రీమేక్ మూవీ 'ప్యారిస్ ప్యారిస్' ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా సెన్సార్ విషయంలో కాజల్ అసంతృప్తిగా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి పోతే..
కాజల్ అగర్వాల్ బోల్డ్ క్యారెక్టర్
ఇప్పటిదాకా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకు ప్రాధాన్యమిస్తూ వచ్చిన కాజల్.. ఈ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేసిందట. ఈ నేపథ్యంలో తన గ్లామర్ డోస్ మరింత పెంచేసిందట. అయితే ఇది నిజమే అని నిరూపించింది ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్. ఈ టీజర్లో ఓ సన్నివేశంలో కాజల్ ఛాతిని వేరొక నటి నొక్కడం చూపించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. దీంతో ఇది కాస్త హాట్ టాపిక్‌గా మారింది.
సెన్సార్ సభ్యుల మతి పోగెట్టేలా బోల్డ్ సీన్స్
సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులు కావడంతో సెన్సార్ బోర్డు అనుమతి విషయమై ఓ రేంజ్ చర్చలు నడిచాయి. బోల్డ్ సన్నివేశాలున్న ఈ సినిమా విడుదలకు సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేదా? అనే చర్చ బాగా నడించింది. అనుకున్నట్లుగానే సినిమాలో సెన్సార్ సభ్యుల మతి పోగెట్టేలా బోల్డ్ సీన్స్ ఉన్నాయట. ఈ మేరకు ఆ సీన్స్ అన్నీ కత్తిరించేసింది సెన్సార్ బోర్డు. దీంతో ఈ చర్చ మరింత ముదిరింది.
ఊహించని రీతిలో కాజల్ రెస్పాన్స్
అయితే సెన్సార్ సభ్యులు సదరు సీన్స్ కత్తిరించడంపై ఎవ్వరూ ఊహించని రీతిలో కాజల్ రియాక్ట్ అయింది. ఇలా కత్తిరించడం తనకు నచ్చలేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఒరిజినల్ వర్షన్ లో ఉన్న సీన్లనే తీశామని, ఇలా సెన్సార్ సభ్యులు చిక్కులు పెట్టడం సరికాదని వాపోయింది. తాను ఆ సీన్స్ చేయడానికి చాలా కష్టపడ్డానని తెలిపింది కాజల్.
యూ ట్యూబ్ సెన్సేషన్ కానుందా..?
ప్రస్తుతం సెన్సార్ కత్తిరింపులపై ఈ సినిమా నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తిరిగి సమీక్షిస్తున్నారు సెన్సార్ సభ్యులు. ఈ నేపథ్యంలో ఒకవేళ సెన్సార్ సభ్యులు అనుమతి ఇవ్వలేదంటే ఆ సన్నివేశాలను యూట్యూబ్‌లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఇదే జరిగితే ఇక యూట్యూబ్ లో కూడా కాజల్ హంగామా మామూలుగా ఉండదు మరి!
'క్వీన్' రీమేక్.. యంగ్ హీరోయిన్స్
బాలీవుడ్లో సూపర్ సక్సెస్ సాధించిన 'క్వీన్' సినిమాను తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో రీమేక్ చేస్తున్నారు. అయితే తెలుగులో తమన్నా నటిస్తుండగా, తమిళంలో కాజల్, కన్నడలో పారుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ ఈ రీమేక్‌లలో నటిస్తున్నారు.