హద్దులు దాటితేనే అసలు మజా.. తేజ చెప్పినట్టే చేశా! చివరకు.. కాజల్ సెన్సేషనల్ కామెంట్స్

కాజల్ అగర్వాల్.. తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్‌లోని అన్ని భాషల్లో సుపరిచితమైన హీరోయిన్. వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించింది. సీనియర్ హీరోయిన్‌గా కొనసాగుతూ 50 సినిమాల మైలురాయిని దాటి మరిన్ని సినిమాలకు కమిట్ అవుతోంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజ ప్రస్తావన తీసుకొచ్చిన కాజల్.. హద్దులు దాటితేనే అసలు మజా అంటోంది. ఆ వివరాలు చూద్దామా..

డైరెక్టర్ తేజ, కాజల్ అగర్వాల్ బాండింగ్

డైరెక్టర్ తేజ, కాజల్ అగర్వాల్ బాండింగ్

నిజానికి డైరెక్టర్ తేజ, కాజల్ అగర్వాల్ మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. తెలుగులో తన మొదటి సినిమా 'లక్ష్మీ కళ్యాణం' తేజ దర్శకత్వంలోనే చేసిన కారణంగా కాజల్ అగర్వాల్‌కి తేజ అంటే చాలా ఇంట్రెస్ట్ కూడా. అందుకే ఆయనతో వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాల క్రితం తేజ దర్శకత్వంలో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో నటించిన కాజల్.. ఇటీవలే మరోసారి 'సీత' రూపంలో తేజతో కలిసి సినిమా చేసింది.

 దర్శకులు హద్దులు దాటమంటారు.. అందులో తేజ ఒకరు

దర్శకులు హద్దులు దాటమంటారు.. అందులో తేజ ఒకరు

ఈ నేపథ్యంలో సరైన పాత్ర దొరికేంత వరకు నటీనటుల్లో ఉన్న సత్తా బయటపడదని, క్యారెక్టర్స్ డిమాండ్‌ చేస్తుంటే నటనా నైపుణ్యం అనేది బయటపడుతుందని అంటోంది కాజల్. కొంతమంది దర్శకులు హద్దులు దాటి నటించమని ప్రోత్సహిస్తారు. అలాంటివారిలో తేజగారు ఒకరని చెప్పుకొచ్చింది కాజల్.

అందమంటే ఇష్టం.. కెమెరా ముందుకు రాగానే

అందమంటే ఇష్టం.. కెమెరా ముందుకు రాగానే

ఓ నటిగా వెండితెరపై అందంగా కనిపించడం తనకు ఇష్టమని, అందుకే ఎమోషనల్‌ సీన్లలోనూ అందమైన లుక్ లోనే కనిపించాలని అనుకునేదాన్నని తెలిపింది కాజల్. స్టార్ట్‌ కెమెరా అనగానే తాను సీన్‌లో లీనం కావడానికంటే ముందు ఫ్రేమ్ లో అందంగా కనిపించాలనే ఆలోచనే మనసులో ఉండేదని.. అయితే అది గ్రహించిన తేజ.. తనను దాన్నుంచి బయటపడేశారని చెప్పుకొచ్చింది.

అందులోనే అసలు మజా..

అందులోనే అసలు మజా..

తేజ ఇచ్చిన సలహాలు, సూచనలు పాటిస్తూ ఆయన చెప్పినట్టే చేశానని కాజల్ అంటోంది. అందువల్లే గత సినిమాల్లో భావోద్వేగ సన్నివేశాలతో పోలిస్తే, ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లోని సీన్లు ఎక్కువ డెప్త్‌గా ఉంటున్నాయని ఆమె తెలిపింది. ఓ హీరోయిన్‌గా ఇంత అనుభవం ఉన్నప్పటికీ, హద్దులు దాటి నటిస్తేనే అసలు మజా ఉంటుందని అర్థమైందంటూ ఆసక్తికరంగా మాట్లాడింది కాజల్.

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్

ఇక కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే తేజతో కలిసి 'సీత' రూపంలో డీలా పడ్డ ఆమె ఆ తర్వాత జయం రవి సరసన 'కోమాలి', శర్వానంద్ సరసన 'రణరంగం' సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు ఆగస్టు 15న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X