ఆ హీరో కోసమే ఐటమ్ గర్ల్ గా మారా.. కాజల్

కాజల్ అగర్వాల్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కలువ కళ్లతో , వైట్ స్కిన్‌టోన్‌తో, మెస్మరైజ్ చేసే చిరునవ్వుతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె జీవితం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరతో మలుపు తిరిగింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో అనతికాలంలోనే తెలుగులో అగ్రకథానాయికగా ఎదిగారు. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు ప్రతి ఒక్కరి ఛాయిస్ కాజలే అయ్యారంటే ఆమె టాలెంట్ అర్ధం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలోకి ఎన్ని కొత్త అందాలు వచ్చినా కొన్నేళ్ల పాటు కాజల్ హవానే నడిచిందంటే అతిశయోక్తి కాదు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ కాజల్ తన సత్తా చాటారు.

కాజల్ పని అయిపోయింది అనుకున్న దశలో ఓ మంచి చిత్రం ద్వారా ఆమె పలకరించేవారు. లాక్‌డౌన్ సమయంలో తన చిన్ననాటి మిత్రుడు, ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడి షాకిచ్చారు. ఈ దంపతులకు ప్రస్తుతం ఒక బాబు జన్మించాడు. భర్త, బాబు కుటుంబంతో గడుపుతూ ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది కాజల్. పెళ్లి తర్వాత సినిమాకు గుడ్‌బై చెబుతుందేమో అనుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి దుమ్మురేపుతున్నారామె.

kajal aggarwal says I did item song In janatha garage only for jr ntr

కాజల్ తన కెరీర్‌లో అన్ని రకాల పాత్రలు చేసి అలరించారు. హీరోయిన్‌గా పీక్స్‌లో వున్న సమయంలో ఆమె చేసిన ఐటెం సాంగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్ ఐటెం సాంగ్‌ చేశారు. కానీ ఆమెను ఇందుకు ఎవరు ఒప్పించగలిగారు.. ఎవరి కోసం ఇలాంటి డేర్ స్టెప్ తీసుకుంది అనే చర్చ జరిగింది. ఈ ప్రశ్నలకు చాలా ఏళ్ల తర్వాత కాజల్ సమాధానం ఇచ్చారు. ఓ ఛానెల్‌లో సీనియర్ కమెడియన్ అలీ హోస్ట్ చేస్తున్న '' అలీతో సరదాగా '' అనే షోలో పాల్గొన్న కాజల్ తన ప్రేమ, పెళ్లి, కెరీర్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇచ్చారు.

దీనిలో భాగంగా జనతా గ్యారేజ్‌లో ఐటెం సాంగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందని అలీ ప్రశ్నించారు. బ్యానర్, స్టార్ డైరెక్టర్, రెమ్యూనరేషన్ గురించి తాను ఈ నిర్ణయం తీసుకోలేదని.. కేవలం ఎన్టీఆర్ కోసమే ఐటం సాంగ్ చేసినట్లు కాజల్ ఆన్సర్ ఇచ్చారు. యంగ్‌టైగర్‌తో బృందావనం, టెంపర్, బాద్ షా చిత్రాల్లో నటించారు కాజల్. ఆయనతో వున్న ఫ్రెండ్‌షిప్ వల్లే జనతా గ్యారేజ్‌లో ఐటెం నెంబర్ చేసినట్లు ఆమె తాజాగా బయటపెట్టారు. దీంతో జూనియర్ అభిమానులు కాజల్ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.

kajal aggarwal says I did item song In janatha garage only for jr ntr

ఇదిలావుండగా.. పెళ్లి తర్వాత ఒప్పుకున్న సినిమాలన్నీ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కావడానికి కారణమేంటీ..? గౌతమ్ ఏమైనా రూల్ పెట్టాడా అని అలీ అడిగారు. తనకు చాలా రోజుల నుంచి యాక్షన్ సినిమాలు, విలన్స్‌ని చితకబాదే క్యారెక్టర్లు చేయాలని వుందని దీనిలో భాగంగానే ఆ టైప్ చిత్రాలకే ఓకే చెబుతున్నానని కాజల్ చెప్పారు. ప్రస్తుతం ఆమె సత్యభామ అనే మూవీలో నటిస్తున్నారు. ఇందులో ఆమె పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర కీలకపాత్ర పోషిస్తున్నారు. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలుగా సుమన్ చిక్కాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X