పవన్ కళ్యాణ్‌తో రొమాన్స్ చేయబోతున్న కాజల్

By Bojja Kumar

హైదరాబాద్: ఆరేళ్ల క్రితం లక్ష్మి కళ్యాణం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన హీరోయిన్ కాజల్ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తూ ఇప్పటి వరకు దాదాపు 15కు పైగా తెలుగు సినిమాల్లో టాలీవుడ్ టాప్ హీరోలైన మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజలతో పాటు నాగచైతన్య, రామ్, నవదీప్, సుమంత్, నితిన్ లాంటి వారితో నటించింది. అయితే అమ్మడు ఇప్పటి వరకు టాలీవుడ్ అగ్రహీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా కూడా చేయలేదు.

తాజాగా అందుతున్న ఆసక్తికర సమాచారం ఏమిటంటే త్వరలో కాజల్ ఆ లోటును కూడా తీర్చుకోబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాలో నటించబోతోంది. ఈ చిత్రాన్ని 'రచ్చ' దర్శకుడు సంపత్ నంది హ్యాండిల్ చేయబోతున్నారు. పవన్ ఫ్రెండ్ శంకర్ మరార్ ఈచిత్రానికి నిర్మాత. త్వరలో ఈ విషయమై అఫీషియల్ స్టేట్ మెంట్ వెలువడనుంది.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలు, అవినీతి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో బిజీగా గడుపుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సంపత్ నందితో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఇక పోతే కాజల్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె జూ ఎన్టీఆర్‌కు జోడీగా 'బాద్ షా' చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తమిళంలో 'ఆల్ ఇన్ ఆల్ ఆఝగు రాజా', 'జిల్లా' చిత్రాల్లో నటిస్తోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత పవన్ సినిమాకు డేట్స్ కేటాయించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X