Don't Miss!
- Sports ధోనీ ట్రేడ్‌మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తేజ గొప్ప అవకాశమిచ్చారు.. స్వార్థంగా ఉంటూనే.. కాజల్ ఏమంటుందో చూడండి
హీరోయిన్ అంటే అలా వచ్చి ఇలా వెళ్లడం కాదని, టాలెంట్ ఉండాలే గానీ అవకాశాలకు కొదవేంటి అని నిరూపిస్తోంది టాలీవుడ్ చందమామ కాజల్. దశాబ్ద కాలానికి పైగా ఇండస్ట్రీలో తిష్ట వేసి అందరు అగ్ర, కుర్ర హీరోలతో రొమాన్స్ చేసింది కాజల్ అగర్వాల్. 33 ఏళ్ల వయసొచ్చినా గ్లామర్ పరంగా కుర్ర హీరోయిన్లకే అసూయ తెప్పిస్తున్న ఈ సుందరి తాజాగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీత సినిమాలో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ అయి విడుదలకు సిద్ధమవటంతో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాజల్ సీత ముచ్చట్లను చెప్పుకొచ్చింది.
''తేజ గారు ఎప్పుడో కథ చెప్పారు. కానీ కాల్షీట్లు కుదరలేదు. నేనే రాజు నేనే మంత్రి సినిమా షూట్లోనే సీత ఈ సినిమాను నాతోనే చేయాలి అని ప్రామిస్ తీసుకున్నా. నేటి ట్రెండ్‌కి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి సినిమా తీశారు డైరెక్టర్ తేజ. నేటితరం అమ్మాయిల జీవితాల్ని ప్రతిబింబించే కథే సీత కథ. తన కలల్ని నిజం చేసుకునేందుకు స్వార్థం చూపించే మగువగా ఈ సినిమాలో నా పాత్ర ఉంటుంది. నటించేందుకు మంచి ఆస్కారం ఉన్న పాత్ర ఇది.
ఆసక్తికర విషయం బయటపెట్టిన డైరెక్టర్ తేజ.. ఇదీ అసలు సంగతి అంటూ
సీత రూపంలో తేజ సర్ ఒక గొప్ప పాత్రలో అవకాశం ఇచ్చారు. ఇక సీత పాత్రను అర్థం చేసుకొని అందులో ఒదిగిపోయేందుకు గాను చాలా పుస్తకాలు చదివాను. అదే కోవకు చెందిన చాలా మంది మనుషుల్ని పరిశీలించి చూశాను. నేటితరం అభినవ సీతకు ప్రతిబింబించేలా నా పాత్ర ఉంటుంది'' అని కాజల్ చెప్పుకొచ్చింది.
ఇక ఈ సినిమాలో తాను నటించిన సాహసోపేతమైన సన్నివేశాల గురించి చెప్పిన కాజల్.. ''సీత చిత్రంలో ఎన్నో సాహసోపేత సన్నివేశాలు చూడొచ్చు. వాటిని చేసే కోణంలో చాలా సార్లు గాయపడ్డాను కూడా. నా కోసం సెట్ లో ఎప్పుడూ ఓ డాక్టర్ సిద్ధంగా ఉండేవారు'' అని తెలిపింది కాజల్. ఇక సినిమా విషయానికొస్తే.. సీత సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. మన్నార చోప్రా, సోను సూద్, అభిమన్యు సింగ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మే 24 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.