twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రధాని రమ్మన్నాడు.. చాలా బ్యాడ్‌గా ఫీల్ అవుతున్నా: కాజల్ సెన్సేషన్ కామెంట్

    |

    దేశంలో రెండోసారి విజయవంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ పార్టీ. ఎన్నికలకు ముందు బీజేపీ గెలుపుపై అనుమానాలున్నా ఊహించని రీతిలో భారీ విజయం నమోదు చేశారు కాషాయ వీరులు. ప్రధానిగా నరేంద్రమోదీ మరోసారి ఢిల్లీ గద్దె పై కూర్చున్నారు. అయితే నిన్న (మే 30 న) జరిగిన ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి కాజల్ అగర్వాల్‌కి ఆహ్వానం రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఈ వేడుకకు కాజల్ హాజరు కాకపోగా ఓ సంచలన ట్వీట్ చేసి షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే..

    మోదీకి కాజల్ మద్దతు

    మోదీకి కాజల్ మద్దతు

    ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీపై, ఆయన పాలసీలపై ఎంతోమంది విమర్శలు గుప్పించినప్పటికీ.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం ఆయనను సమర్దించి మాట్లాడింది. అంతేకాదు బీజేపీ పార్టీకి తన వంతు మద్దతు పలికింది కాజల్. ఎన్నికలు ముగిశాయి.. ఇక రిసల్ట్ చూస్తే కాజల్ అనుకున్నదే అక్షరాలా నిజమైంది.

    కాజల్ రావాలంటూ రమ్మని ప్రధాని పిలుపు

    కాజల్ రావాలంటూ రమ్మని ప్రధాని పిలుపు

    దేశంలో బీజేపీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో కాజల్ ఇచ్చిన మద్దతును మర్చిపోలేదు కమల నాథులు. ఎంతో మంది పుర ప్రముఖులు హాజరుకానున్న ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కాజల్‌కి ఆహ్వాన పత్రిక పంపారు. గురువారం సాయంత్రం జరిగే మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలంటూ ఆ ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.

    మోదీ ప్రమాణ స్వీకారం జరిగింది.. కాజల్ మాత్రం

    భారతదేశ 15వ ప్రధానమంత్రిగా గురువారం నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం జరిగింది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ఢిల్లీ లోని రాష్ట్రపతి ప్రాంగణంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అతిరథ మహారథులు హాజరయ్యారు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం డుమ్మా కొట్టేసింది.

    కారణం చెబుతూ బాధపడిన కాజల్

    కారణం చెబుతూ బాధపడిన కాజల్

    అయితే మోదీ ప్రమాణ స్వీకారానికి తాను వెళ్లకపోవడానికి కారణం చెబుతూ బాధపడింది కాజల్. ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా ఓ సందేశం ఇచ్చింది. తనకు ఆ ఆహ్వానం ఆలస్యంగా అందిందని, అందువల్లే ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని తెలుపుతూ, ఇంతటి చారిత్రాత్మక కార్యక్రమానికి హాజరు కానందుకు చాలా బ్యాడ్‌గా ఫీలవుతున్నానని కాజల్ పేర్కొంది. ప్రమాణ స్వీకారం చేసిన నాయకులందరికీ ఈ అద్భుతమైన పదవీకాలంలో మరింత శక్తి లభించాలని ఈ సందర్బంగా ఆమె కోరింది.

    English summary
    Narendra Modi invited kajal agarval for his ceremony to take rights of prime minister of india. But Kajal not attended this programe. The reason kajal tweets as..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X