twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాజల్ అగర్వాల్‌కి అరుదైన గౌరవం.. మహేష్ బాబు, ప్రభాస్‌లతో పాటు ఈమె కూడా!

    |

    తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో భారీ పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. సౌత్ ఇండియన్ తెరపై దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ దశాబ్ద కాలంగా హవా కొనసాగిస్తోంది. తాజాగా ఈమెకు అరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోకి పోతే..

    మేడం టుస్సాడ్స్ మ్యూజియం

    మేడం టుస్సాడ్స్ మ్యూజియం

    వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసి, వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు కాజల్ అగర్వాల్ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఈ విగ్రహాన్ని సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు.

    కాజల్ కొలతలు.. అంతా రెడీ

    కాజల్ కొలతలు.. అంతా రెడీ

    ఇప్పటికే పలువురు సినీ తారల విగ్రహాలను తమ మ్యూజియంలో ఉంచిన మేడం టుస్సాడ్స్ మ్యూజియం వారు ఇప్పుడు కాజల్ అగర్వాల్ విగ్రహాన్ని రెడీ చేస్తున్నారు. ఈమేరకు ఇప్ప‌టికే ఈ అమ్మ‌డి కొల‌త‌లు కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా కాజల్ పేర్కొంది. ఈ మేరకు తన ఆనందాన్ని తెలియజేసింది.

    మహేష్ బాబు, ప్రభాస్ అందరిలో కాజల్

    మహేష్ బాబు, ప్రభాస్ అందరిలో కాజల్

    సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఫిబ్రవరి 5వ తేదీన కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహం ఆవిష్కరించనున్నారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్‌గా కాజల్ రికార్డు నెలకొల్పనుంది. ఇప్పటికే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో అమితాబ్, హృతిక్, ఐశ్వర్య, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, మహేష్ బాబు, ప్రభాస్ విగ్రహాలు ఉన్నాయి.

    కాజల్ అగర్వాల్ కెరీర్

    కాజల్ అగర్వాల్ కెరీర్

    ఇటీవలే 'సీత' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన కాజ‌ల్ అగర్వాల్.. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాసన్ స‌ర‌స‌న 'భార‌తీయుడు 2' సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీలో 'ముంబై స‌గ' అనే చిత్రంలో నటిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'అల.. వైకుంఠపురములో' సినిమాలో కాజల్ ఓ ఐటెం సాంగ్ చేస్తోందని తెలిసింది.

    English summary
    Kajal Aggarwal wax figure will be inagurated in Madame Tussauds Singapore On 5th of February 2020. She becomes the 1st Actress from the South Indian Movie industry to get her own wax statue at Madame Tussauds.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X