ఘనంగా కాజల్ అగర్వాల్, గౌతమ్ పెళ్లి.. ఫ్యాన్స్‌కు శుభవార్త.. రకుల్, మంచు లక్ష్మీ నాటీ కామెంట్స్

దక్షిణాది హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు వివాహితగా మారిపోయింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న కాజల్.. తన ప్రియుడిని ముంబైలోని విలాసవంతమైన హోటల్‌లో ఈ సాయంత్రం వివాహం చేసుకొన్నది. కాజల్ మెడలో మూడు మూళ్లు వేసి గౌతమ్ కిచ్లూ తన భార్యగా చేసుకొన్నారు. ఈ వేడుక నిరాడంబరంగా సాగింది. పెళ్లికి సంబంధించిన తాజా సమాచారం గురించి మరిన్ని వివరాలు..

Recommended Video

#kajalaggarwalWedding : Kajal Aggarwal And Gautam Kitchlu Are Finally Married
 ఆడంబరాలకు, హంగామాకు దూరంగా

ఆడంబరాలకు, హంగామాకు దూరంగా

ముంబైలో కఠినంగా లాక్‌డౌన్ నిబంధనలు కొనసాగుతుండటంతో కాజల్ పెళ్లికి ఆడంబరాలకు, హంగామాకు దూరంగా నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ కాజల్, గౌతమ్ కిచ్లూ పెళ్లిని కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ పెళ్లికి అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం.

సంగీత్‌లో హుషారుగా కాజల్

సంగీత్‌లో హుషారుగా కాజల్

పెళ్లికి కొద్ది గంటల ముందు కాజల్, గౌతమ్ సంగీత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోదరి నిషా అగర్వాల్ ఇతర కుటుంబ సభ్యులు ఆనందంతో డ్యాన్సులు చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇక కాజల్ పెళ్లికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్ ట్రెండ్ అయింది.

తుఫాన్‌కు ముందు ప్రశాంతత అంటూ

తుఫాన్‌కు ముందు ప్రశాంతత అంటూ

వివాహం జరగడానికి కొద్ది గంటల ముందు పెళ్లికూతురుగా మారిన కాజల్ అగర్వాల్ తన ఫోటోను షేర్ చేసింది. ఇది తుఫాన్‌కు ముందు ప్రశాంతత అంటూ కామెంట్ చేసింది. కాజల్ పోస్టుపై రకుల్, మంచు లక్ష్మీ తదితరులు స్పందించారు. ముద్దుగమ్మలా ఉన్నావు...అంటూ పెళ్లి శుభాకాంక్షలు అందించారు.

 పెళ్లి తర్వాత కూడా నటన

పెళ్లి తర్వాత కూడా నటన

అంతేకాకుండా కాజల్ తన ఫ్యాన్స్‌కు శుభవార్తను అందించింది. పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగిస్తాను. ఎప్పటి లానే మీకు వినోదాన్ని పంచుతాను. గతంలో మాదిరిగానే నా అభిమానులను సంతోష పరిచేందుకు సిద్ధంగా ఉన్నాను. పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైనది. నా కెరీర్‌కు ఎలాంటి అడ్డంకి కాదు అని కాజల్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X