మహేష్-సుకుమార్ సినిమా : కాజల్ పాత్ర అదేనా?
మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రానికి కాజల్ కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఆ సినిమా యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కాజల్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కూడా ఇందులో లెక్చరర్ పాత్ర చేస్తున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 23న ప్రారంభం కానుంది. తొలుత ఈ జంటపై హైదరాబాద్‌లో ఓ పాటను చిత్రీకరించనున్నారు. అనంతరం 30 రోజుల పాటు బ్యాంకాక్‌లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక్క సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ ట్యూన్ రెడీ అయింది. సుకుమార్, చంద్రబోస్, దేవిశ్రీ ప్రసాద్ కలిసి ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ విషయాన్ని దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











