పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాజల్
కాజల్ మాట్లాడుతూ... ''సినిమాలో హీరోయిన్ అంటే కేవలం ఆడిపాడటానికే పరిమితమవ్వాలి, హీరో పాత్ర అంటే ఇలాగే ఉండాలి అనే లెక్కలు ఇక కనుమరుగైపోతాయి. కొత్త కథలు తెరపైకొస్తున్నాయి. పాత్రల తీరు తెన్నులు కూడా మారిపోతున్నాయి'' అని చెబుతోంది కాజల్. ఆమె హిందీలోనూ అవకాశాలకోసం ప్రయత్నిస్తోంది. తెలుగులో మాత్రం ఇంకా ఏ సినిమా ఒప్పుకోలేదు.
హీరోయిన్స్ పాత్రల్లో చోటు చేసుకొంటున్న మార్పుల గురించి కాజల్ మాట్లాడుతూ ''కథ ఏం చెబితే అది చేయాలి. లెక్కలు వేసుకొని పాత్రల్ని తెరకెక్కించడం ఎందుకు? అనేదే నా ప్రశ్న. ఇటీవల కథానాయికల పాత్రలకు నిజంగానే ప్రాధాన్యం పెరిగింది. వాణిజ్య నేపథ్యమున్న చిత్రాల్లోనూ కథానాయికల కోసం మంచి పాత్రలు సృష్టిస్తున్నారు. ఇటీవల నాకు మంచి పాత్రలు దక్కుతున్నాయి. నటనని ప్రదర్శించేందుకు వీలు దొరుకుతోంది. 'తుపాకీ'లో ఓ బాక్సర్‌గా, ఇప్పుడు విజయ్ చిత్రంలోనే ఇంకో రకమైన పాత్రలో కనిపిస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది'' అని చెప్పుకొచ్చింది కాజల్.
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.చిత్రీకరణ సగం పూర్తయింది. విజయ్ నటించిన 'వేలాయుధం'కి సహాయ దర్శకుడిగా పనిచేసిన నేసన్ మెగాఫోన్ పట్టుకుంటున్నాడు. 'జిల్లా' హాస్పిటల్, ఎం.పి బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. మోహన్‌లాల్, విజయ్‌పై కీలక సన్నివేశాల్ని చిత్రిస్తున్నారు. ఆర్టీ నేసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆర్.బి.చౌదరి నిర్మాత. ఈ నెల 12 వరకు చిత్రీకరణ జరుగుతుంది


Click it and Unblock the Notifications












