For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేష్ సినిమాపై రూమర్ నిజమే

  By Srikanya
  |

  హైదరాబాద్: మహేష్, సుకుమార్ కాంబినేషన్ చిత్రం నుంచి కాజల్ బయిటకు వచ్చిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందరూ ఇవి రూమర్స్ గా భావించినా చివరకు ఇది రూమర్ కాదు ఇది నిజమే అని తేలింది. కాజల్ ఈ చిత్రం నిర్మాతలకు ఈ విషయం క్లియర్ గా చెప్పి, తాను డేట్స్ ని ఎడ్జెస్ట్ చేయలేనని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఆమె డేట్స్ ని ప్రోపర్ గా ఉపయోగించుకోలేకపోయిన యూనిట్ సరేనని మరో హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారు. అక్టోబర్ 10 నుంచి ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ మొదలువుతుంది.

  మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సినిమా కథ విషయానికొస్తే... గోవా బ్యాక్‌ డ్రాప్‌తో ఈ చిథ్ర కథ నడుస్తుందని తెలిసింది. అంతే కాకుండా ఇందులో మహేష్ బాబు తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఇందులో లెక్చరర్ పాత్ర చేస్తున్నారని అంటున్నారు.

  అల్లు అర్జున్ 'ఎవడు' చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్ సరసన కాజల్ గెస్ట్ గా రీసెంట్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆర్య 2 చిత్రంలో ఈ జంట రొమాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో ఈ మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ జంట మద్య లవ్ స్టోరీని బాగా పండించటానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ పదిహేను నిముషాలు పాటు ఉంటుందని అంటున్నారు. ఓ పాట, రెండు ఫైట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఆ లవ్ స్టోరీ చాలా స్పీట్ గా నడిపి కథకు కీలకంగా మార్చనున్నారని తెలుస్తోంది. దాన్ని బేస్ చేసుకునే సినిమా మొత్తం నడుస్తుందంటున్నారు. తన కెరీర్‌ మలుపు కారణమైన 'మగధీర'ను గుర్తుచేసుకుంటూ ఆమె 'ఎవడు' చిత్రంలోని పాత్రకు అంగీకరించిందని చెప్పుకుంటున్నారు.

  కాజల్ తెలుగు మాత్రమే కాక,తమిళంలోనూ తన హవా నడిపిస్తోంది. తాజాగా ఆమె ఓ ట్రైలింగ్వువల్ చిత్రం ఓకే చేసింది. ప్రముఖ చాయాగ్రాహకుడు రవి.కె.చంద్రన్ దర్శకుడుగా మారుతూ డైరక్ట్ చేయనున్న చిత్రంలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది. ఈ చిత్రంలో జీవా హీరోగా చేయనున్నారు. ఈ మేరకు ఆమెకు భారి రెమ్యునేషన్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ తాను కలలో కూడా ఊహించలేదని అంటోందామె.

  దర్శకుడు రవి.కె.చంద్రన్ గతంలో రంగ్ దే బసంతి, దిల్ చాహతా హై వంటి భారి చిత్రాలకు అద్బుతమైన కెమెరా వర్క్ ఇచ్చారు. అలాగే హరీష్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. దాంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. కాజల్ పాత్ర కూడా చాలా డిఫెరెంట్ గా తీర్చి దిద్దారని, ఇప్పటివరకూ ఆమె చేయని పాత్ర అని అంటున్నారు. రంగం తో పరిచయమైన జీవా హీరో కాబట్టి మాగ్జిమం స్ట్రైయిట్ చిత్రం తరహాలో బిజినెస్ జరగ వచ్చని ట్రేడ్ లో లెక్కలు వేస్తున్నారు.

  English summary
  Now Kajal Agarwal is on the verge of losing Mahesh Babu’s film. It is almost confirmed that she won’t be doing this Mahesh Babu - Sukumar movie. Although she shot for the film for few days, the director is now looking to replace her with another actress. Kajal Agarwal reportedly told the producers that she cannot provide the dates for the film for the fresh schedules. The dates that she has given for the film were not used properly. So currently hunt is on for new Jodi for Mahesh Babu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X