»   » డబ్బు సంపాదించేందుకు హీరోయిన్ కాజల్ మరో ప్లాన్...

డబ్బు సంపాదించేందుకు హీరోయిన్ కాజల్ మరో ప్లాన్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన భామల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ‘లక్ష్మి కళ్యాణం' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్.... ‘చందమామ'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘మగధీర' తర్వాత స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.

సర్దార్ గబ్బర్ సింగ్.. సెట్స్‌లో పవన్ కళ్యాణ్-కాజల్ (ఫోటోస్)

మగధీర చిత్రం తర్వాత అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. తెలుగు, తమిళంలో దాదాపు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ మహేష్ బాబుతో ‘బ్రహ్మోత్సవం', పవన్ కళ్యాణ్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంల్లో నటిస్తోంది.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్: ఎక్స్ ఫోజింగుతో షాకిచ్చిన కాజల్ (వీడియో)

Kajal become an entrepreneur

దీపం ఉన్నపుడే ఇల్లు చక్కదిద్దు కోవాలన్న చందంగా .... హీరోయిన్లు కూడా ఈ మధ్య కాలంలో కెరీర్ బాగా సాగుతున్నపుడే బిజినెస్ రూట్లోకి దిగుతున్నారు. సొంతగా దుకుణం ఓపెన్ చేస్తున్నారు. ఆల్రెడీ కాజల్ మర్సాలా పేరుతో ఓ జ్యువెల్లరీ బ్రాండ్ రన్ చేస్తోంది. తన సోదరి నిషా అగర్వాల్ తో కలిసి దాన్ని రన్ చేస్తోది.

ఈ విషయమై కాజల్ మాట్లాడుతూ...‘నేను, నా సిస్టర్ కలిసి జ్యువెలరీ బ్రాండ్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. నా సిస్టర్ జ్యెవెలరీ డిజైన్ చేస్తుంది. మిగతా పనులు నేను చూసుకుంటాను. సౌత్ లో జ్యువెలరీ బిజినెస్ విస్తరించే ఆలోచనలో ఉన్నాం. దీంతో పాటు సోషల్ కామర్స్ వెంచర్ స్టార్టప్ ఆలోచన కూడా ఉంది' అని కాజల్ మీడియాతో చెప్పుకొచ్చారు.

English summary
Speaking to scribes lovely Kajal shared her love to become an entrepreneur. Kajal who owns a jewellery brand Marsala says “My sister and I started the brand together. She designs jewellery and I help her out with the rest. I am looking forward to expand its presence down South. I’ve a start-up social commerce venture too,”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu