కాజల్...'మగధీర'కు ముందు తర్వాత
'మగధీర' చిత్రంలో హీరోయిన్ కావడం నాకు గాడ్ గిఫ్ట్. రాత్రికి రాత్రి నన్ను స్టార్‌ని చేసిన సినిమా అది. నా ప్రతిభపై నాకు నమ్మకం ఉంది. నేను స్టార్ హీరోయిన్ ని అవుతానని 'మగధీర'కు ముందే ఊహించా. నా ఊహ నిజమైంది. అంటూ కాజల్ చెప్పుకొచ్చింది. 'మగధీర'కు ముందు.. 'మగధీర'కు తర్వాత మీ జీవితాన్ని విశ్లేషించుకుంటే మీకేమనిపిస్తుందని ఆమెని మీడియా వారు అడిగితే ఇలా చెప్పుకొచ్చింది. అలాగే ఎంత స్టార్ ని అయినా నా బిహేవియర్ లో ఏ మాత్రం మార్పు ఉండదు. ఎప్పుడూ కాజల్ ఒకేలా ఉంటుంది. విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు క్రుంగిపోవడం నా చరిత్రలో లేదు. 'మగధీర'కు ముందు పాత్రల విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకునేదాన్నో..ఇప్పుడు కూడా అంతే శ్రద్ధతో పనిచేస్తున్నా' అని చెప్పుకొచ్చింది కాజల్. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ సరసన 'మెరుపు' చిత్రంలో, ప్రభాస్ సరసన దశరధ్ దర్శకత్వం వహించబోయే చిత్రంలో నటించనున్నారు.


Click it and Unblock the Notifications











