కాజల్ అగర్వాల్ బిజినెస్ ఉమన్!

ఆ మధ్య 'మగధీర' విడుదల సమయంలో చెర్రీని పొగడ్తలతో ముంచెత్తిన కాజల్ 'మిస్టర్ పర్‌ఫెక్ట్'తో ప్రభాస్ నటనను తెగ పొగిడింది. ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్‌బాబుతో కలిసి నటిస్తున్న 'బిజినెస్ మ్యాన్' చిత్రంలో మహేష్ నటనను స్క్రీన్‌పై తాను ఎప్పుడు చూద్దామా అని వెయిటింగ్ చేస్తున్నానంటూ అతని అందాన్ని తెగ పొగిడేస్తోంది. మహేష్ బాబు పక్కా జంటిల్మేన్ అని తన పని తాను చేసుకుంటూ పోతా డు. ముఖ్యంగా యాక్టింగ్ చేసేటప్పుడు అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంటోంది. ఈ వ్యవహారం అంతా కాజల్ లో దాగి ఉన్న 'బిజినెస్ ఉమన్' రూపం అని. తన అందం, టాలెంట్ తో పాటు...ఇలా కాకా పట్టడం ద్వారా సినిమా బిజినెస్ పెంచుకుంటోందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











