డార్లింగ్ కి బాలీవుడ్ లో కూడా నెం 1 ప్లేస్ ఖాయం అంటున్న ఫ్యాన్స్...

By Sindhu

బాలీవుడ్ భామలు టాలీవుడ్ లోకి అడుగుపెట్టి హవా నడిపిస్తుంటే..ఇక్కడ ఓ వెలుగు వెలుగుతున్న తారమణులు బాలీవుడ్ లో చాన్సులు కొట్టేస్తున్నారు. జెనీలియా, అసిన్, త్రిష..ఇలా మన తెరపై నిరూపించుకున్న తారలు హిందీ తెరను కూడా కనువింద్ చేశారు. చేస్తున్నారు.ఆ రకంగా బాలీవుడ్ లో అలలు రేపుతున్న హీరోయిన్స్.. తాజాగా ఆ జాబితాలోకి కాజల్ అగర్వాల్ చేరిపోయారు. ఈ పంజావీ బ్యూటీకి అజయ్ దేవగణ్ సరసన నటించే అవకాశం వరించింది. తమిళంలో సూర్య, అనుష్క జంటగా రూపొందిన 'సింగమ్"(తెలుగులో 'యముడు") చిత్రానికి ఇది రీమేక్, కోలీవుడ్ లో ఈ చిత్రం ఘనవిజం సాధించింది.

ఈ సినిమాను చూసిన అజయ్ దేవగణ్ హిందీలో చేయాలని తెగ ముచ్చటపడ్డారట. కథానాయికగా నటించే అవకాశం ఎవరికి వస్తుంది?అని చర్చలు సాగుతున్న తరుణంలో 'కాజల్"పేరు వినిపించింది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం రూపిందనుంది. దాదాపు ఆరేళ్లక్రితం 'క్యోం హో గయా న" అనే హిందీ చిత్రంలో కాజల్ ఓ పాత్ర చేశారు. మళ్లీ ఇన్నేళ్లకు ఆమె హిందీలో చేయబోతున్నారు. కాకాపోతే ఈసారి కథానాయికగా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించబోతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ రంగాల్లో నిరూపించుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా శెభాష్ అనిపించుకుంటారని ఆమె అభిమానులు అధికంగా చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X