దగ్గరుండి మరీ చెల్లెలికి మార్కెట్ క్రియేట్ చేస్తోందా స్టార్ హీరోయిన్..!
హీరోయిన్ గా కాజల్ కి ఇప్పుడు టాలీవుడ్ లో వున్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో టాప్ ఛెయిర్ ఆమెదే ఇప్పుడు. అనుష్క, ఇలియానాల నుంచి గట్టిపోటీ వున్నా, హీరోలు, దర్శక నిర్మాతల ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం కాజల్ కే. అంతలా, టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగేస్తోన్న కాజల్, పనిలో పనిగా తన చెల్లెల్నీ టాలీవుడ్ లోకి తీసుకొచ్చేసింది. తొలి చిత్రం ఆశించిన విజయాన్నివ్వకపోవడంతో డీలాపడ్డ చెల్లెల్ని కాజల్ ఇప్పుడు వెంటేసుకు తిరుగుతోంది.
తనకు ఏ ఆఫర్ వచ్చినా..'నేను బిజీగా వున్నా..నా చెల్లెలికి ఆ అవకాశమిచ్చి చూడొచ్చుగా.."అంటూ చెల్లెల్ని ప్రమోట్ చేసే పనిలో బిజీగా వుంది. సినిమా అవకాశాలే కాదు, రిబ్బన్ కటింగుల విషయంలోనూ కాజల్ తన చెల్లెలికి భలేగా ఛాన్సులిప్పించేస్తోంది. వన్ ప్లస్ వన్ ఆఫర్ లెక్కన, కాజల్ ఇప్పుడు తాను రిబ్బన్ కటింగులకు వెళుతూ తనతోపాటు తన చెల్లెల్ని కూడా వెంటేసుకెళ్తోంది. ఇందు కోసం ఎక్స్ ట్రా ఛార్జ్ వసూలు చేస్తోందిలెండి. భలే తెలివైంది కాజల్..అంటూ ఆమె తన చెల్లెల్ని మార్కెట్ చేస్తోన్న తీరుకి అంతా షాకైపోతున్నారు.


Click it and Unblock the Notifications











