'బిజినెస్ మ్యాన్'లో కాజల్ పాత్ర ఏమిటి?
పూరి జగన్నాధ్,మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందిన బిజినెస్ మ్యాన్ చిత్రం రేపు విడుదల అవుతోంది. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ పాత్ర పేరు చిత్ర. ఆమె ఓ చిత్రకారిణి. ఆమెది వేరే ప్రపంచం. ఆమె రంగులు, బొమ్మలతోనే కాలక్షేపం చేస్తూంటుంది. ఆమెను చూడగానే మహేష్ ప్రపోజ్ చేస్తాడు. ఆమె పట్టించుకోదు. అప్పుడే పిల్లా చావ్..పాట వస్తుంది. ఆ తర్వాత ఆమె తండ్రి నాజర్ పోలీస్ ఆఫీసర్..వుంటాడు..వాళ్ల మధ్య జరిగే కథ ...ఆ తర్వాత వీరిద్దరికీ పరిచయం ఎక్కడ ఎలా జరిగింది? ముంబైలో ఆ తతర్వాత సూర్యకి ఎదురైన పరిస్థితులేంటి...అనేది మిగతా కథ.
ఇక ఈ చిత్రంలో మహేష్ కీ,కాజల్ కీ మధ్య లిప్ లాక్ కిస్ సీన్ పెట్టారు పూరీ. ఇక ఈ చిత్రంపై కాజల్ చాలా ఆశలు పెట్టుకుంది. అందుకే ఈ మధ్యన తిరుపతి వెళ్లి బాలాజీకి మ్రెక్కుకుంది.ప్రస్తుతం కాజల్ తన తాజా సినిమా బిజినెస్ మేన్ రిలీజ్ పై ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గతంలో కాజల్ నటించిన మగధీర చిత్రం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలవడం, తాజాగా బిజినెస్ మేన్ సినిమా కూడా అసినిమా రేంజ్ ను అందుకుంటుందనే రేంజ్ లో ప్రచారం జరుగుతుండటంతో చాలా ఎక్సైటెడ్ గా ఉంది. గత సంవత్సరం వీర, దడ ప్లాపులతో కాస్త వెనక పడ్డ కాజల్ ఈ సినిమా హిట్టయితే పూర్వ వైభవాన్ని సంతరించుకుని ఈ యేడు టాప్ హీరోయిన్‌గా తన హవా కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











