ఎడిటింగ్ లో కట్ చేసారని కాజల్ ఏడుపు
కాజల్ కి ఇప్పుడు బాధ వచ్చి పడింది.ఆమె హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన 'సింగమ్"సినిమాలో ఆమె పాత్రను ఎడిటింగ్ లో కట్ చేసేసారని గోల చేస్తోంది.ఆ సినిమా ఆమెకు ఆనందాన్ని ఇవ్వలేదు.సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా ఆమె చాలా విచారంగా ఉంది.తాను సినిమా ప్రమోషన్ లో పాల్గొనకుండా యూనిట్ కి ట్విస్ట్ ఇచ్చింది.అయితే ఈ విషయాలని ఆమె ఒప్పుకోవటం లేదు. ఆమె ఈ మ్యాటర్ పై ఖండించి మాట్లాడుతూ..'సింగమ్"లో నా పాత్ర చిన్నదని ముందే తెలుసు. అయితే నా పాత్ర సినిమా హిట్ అవటానికి దోహదపడుతుందని ముందుగానే గ్రహించాను. అందుకే ఇష్టంతో ఈ పాత్ర చేశాను. సింగమ్ యూనిట్‌లో ఎవ్వరితో నాకు విభేదాలు లేవు. . ఇక ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాకపోవడానికి కారణం ఒంట్లో బాగుండకపోవడమే. పైగా కొన్ని సౌత్ సినిమాలతో బిజీగా ఉన్నాను. అనవసరంగా ప్రతిదాన్నీ వక్రీకరించవద్దు అంటూ అంది కాజల్.


Click it and Unblock the Notifications











