అమ్మో వాటికి నేను ఎప్పుడూ దూరమే: కాజల్
తెలుగు సినిమాల్లో నేను సంతృప్తిగా ఉన్నాను. నేను ఆశించిన స్థాయి కన్నా ఈ పరిశ్రమ నాకు గొప్ప స్థానాన్నే ఇచ్చింది దాన్ని నిలబెట్టుకోవడానికి సదా ప్రయత్నిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది కాజల్. చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న కాజల్ ఈ మధ్య ఖాళీ సమయాల్లో తన చెల్లెలికి సినీ పాఠాలను నేర్సిస్తోందట. దాని గురించి వాకబు చేస్తే 'తను నా కన్నా చాలా చిన్నది. ఇంట్టో అందరం తనని బాగా గారాభం చేస్తాం. అందుకే తనకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని. జాగ్రత్తగా డీల్ చేస్తాం.
ఈ పరిశ్రమలో మనం ఎంత కష్టపడ్డాం అనేది ముఖ్యం. అంతకన్నా కీలకం ఎదుటివారితో ఎలా మసలుకుంటున్నామన్నది. ఇక్కడ మన మంచితనమే మాట్లాడుతుంది. ఆడంబరాలకు దూరంగా వినయంగా ఉండటం చాలా ముఖ్యం. నేను ఆదినుంచి దీన్నే పాటిస్తున్నాను. అందుకే సోషల్ నెట్ వర్కింగ్ లలో కూడా ఎక్కడా నేను పాలుపంచుకోవడంలేదు. ఏదైనా నా అభిమానులకు చెప్పాలనుకుంటే నేరుగా పత్రికలద్వారానో, టీవీల ద్వారానో చెబుతాను. నాకు తెలిసిన ఇలాంటి కొన్ని విషయాల్లో నిషాకు టిప్స్ ఇస్తుంటాను" అని వివరించింది కాజల్...


Click it and Unblock the Notifications











