నాకేమి ఆ పిచ్చి లేదు...కాజల్
'బిజినెస్ మ్యాన్' హిట్‌తో కాజల్ ఒక్కసారిగా రెమ్యునేషన్ పెంచేసిందంటూ వార్తలు అంతటా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆమె మీడియా వద్ద ఆ వార్తల్ని ఖండించారు. ఆమె మాట్లాడుతూ...నిజానికి నేను ఎంత రెమ్యునేషన్ తీసుకుంటున్నాను అనే విషయమై ఎప్పుడూ మాట్లాడటానికి ఇష్టపడను. అలాగే ఆ విషయాలు ఇతరులకు చెప్పటానకి ఆసక్తి చూపను. అది ప్రొపెషనల్ సీక్రెట్స్ గానే ఉంచాలి. అయితే ఇప్పుడు చెప్తున్నాను..నాకేమీ డబ్బు పిచ్చి లేదు...నేనెప్పుడూ నా మార్కెట్ ని మించి పైసా కూడా ఎగస్ట్రా తీసుకోలేదు.
అలాగే ఏ నిర్మాతనూ నేను ఇంత రెమ్యునేషన్ ఇస్తేనే చేస్తాను అని డిమాండ్ కూడా చెయ్యలేదు. సినిమా హిట్ అయ్యితే చాలా నేను రెమ్యునేషన్ పెంచేసానని, ప్లాఫ్ అవ్వగానే నా కెరీర్ అయ్యిపోయిందని ఎందుకు వార్తలు వస్తూంటాయో అర్దం కాదు. అయినా సినిమా హిట్టైనప్పుడు పెంచేసానన్నవాళ్లు..నేను ఫ్లాప్ ల్లో ఉన్నప్పుడు కూడా తగ్గించేసానని ఎందుకు చెప్పరో ఆర్దం కాదు అంది. ఇక ప్రస్తుతం ఆమె తమిళంలో మాట్రాన్, తుపాకి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. క్రితం సంవత్సరం వరస పరాజయాలతో పెయిల్యూర్ హీరోయిన్ గా ముద్రవేయించుకున్న ఈమె ఈ సంవత్సరం తనకు పూర్తిగా కలిసివస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తోంది.


Click it and Unblock the Notifications











