ఫోటోషూట్ నిజమే అంటూ క్లారిటి ఇచ్చిన కాజల్..!
ఎఫ్ హెచ్ ఎమ్ పత్రిక కవర్ పేజిపై కాజల్ అగర్వాల్ ఇచ్చిన టాప్ లెస్ ఫోజు వివాదం అయ్యింది. కాజల్ ఇలా చెయ్యడం అవసరమా? అని విమర్శిస్తున్నారు. ఇది కాజల్ ఫోటో కాదని, మార్ఫింగ్ చేశారని ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ చెప్పింది. ఈ విషయం గురించి కాజల్ మాట్లాడుతూ...'ఆ పత్రికకు ఫోటో షూట్ చేసిన మాట వస్తవమే..కానీ ఆ ఫోజు మాత్రం ఇవ్వలేదు.
బ్లాక్ ట్యూబ్ టాప్ వేసుకున్నాను. అది లేనట్లుగా ఫోటోని మార్చారు. దాంతో టాప్ లెస్ అన్నట్లు కనిపిస్తోంది. ఫోటో షూట్ తర్వాత ఆ ఫోటోలను నాకు పంపించి, నేను సమ్మతించిన తర్వాతే పబ్లిష్ చేయమన్నాను.. వాళ్లు అది చెయ్యకపోగా.. నేను ఇవ్వని ఓ ఇంటర్వ్యూని ప్రచురించారు. ఇది న్యాయం కాదు" అని చెప్పింది.


Click it and Unblock the Notifications











