చచ్చినా 'మిస్టర్ పర్ ఫెక్ట్'ని పెళ్ళి చేసుకోను: కాజల్
ప్రభాస్, కాజల్ కాంబినేషన్ లో వచ్చిన 'మిస్టర్ పర్‌ఫెక్ట్' చిత్రం హిట్టయిన సంగతి తెలిసిందే. అలాగే హిట్ పెయిర్ అయిన వీరిద్దరి మధ్యా లవ్ ఎఫైర్ నడుస్తోందని, వారిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వస్తువ్నాయి. ఈ నేపధ్యంలో ఆమెను మీకు ఎట్లాంటివాడిని మీ జీవిత భాగస్వామిగా ఆహ్వానిస్తారు అంటే ఆమె తడుముకోకుండా ...చచ్చినా 'మిస్టర్ పర్ ఫెక్ట్' లాంటి వ్యక్తిని కోరుకోను. ప్రతిదీ మనమే అడ్జస్ట్ కావాలంటే చాలా కష్టం. ఆ క్యారెక్టర్‌ని అర్థం చేసుకోవాలంటే చాలా మెచ్యూర్డ్‌గా ఉండాలి. అప్పుడే ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉంటుంది. లేకుంటే ఇద్దరికీ ఇబ్బందే అని తేల్చేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ చిత్రం 'సింగం' లోనూ, నాగచైతన్య సరసన ఓ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె రీసెంట్ గా చేసిన 'వీర' చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అందులో ఆమె 'కబడ్డీ చిట్టి'గా నటించింది. అలాగే ఆమె మహేష్ సరసన 'ది బిజినెస్ మేన్' చిత్రం చేస్తోంది. పూరి జగన్నాధ్ దర్సకత్వంలో రూపొందే ఆ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











