కాజల్ కామెంట్స్ కి బన్నీ హర్ట్ అయ్యాడా?
నా సినిమాల గురించి చెబుతున్నప్పుడు ఎవరైనా 'మగధీర' ప్రస్తావిస్తారు. అయితే ఆ సినిమాకి ఎంత విలువ ఇస్తానో, 'ఆర్య 2'కీ నేను అంతే విలువ ఇస్తాను. ఎందుకంటే 'మగధీర'లో అందంగా కనిపించడానికి ఎంత కష్టపడ్డానో, 'ఆర్య 2'లో ఇద్దరి మధ్య నలిగే అమ్మాయి పాత్రలో నటించడానికి అంతే కష్టపడ్డాను. ఒకదానికి మంచి ఫలితం వచ్చింది. రెండో దానికి రాలేదు అంటూ కాజల్ ఈ మధ్యన 'ఆర్య 2' గురించి ప్రస్దావించింది. అయితే 'ఆర్య 2'ని అల్లు అర్జున్ హిట్ గా పరిగణిస్తూండటంతో ఆ మాటలకు హర్ట్ అయ్యాడని అంటున్నారు. తన సన్నిహితులు వద్ద కాజల్ అలా మాట్లాడకుండా ఉండవలిసిందని వాపోయాడట. అందులోనూ బద్రీనాధ్ కూడా ఫ్లాప్ అవటంతో ఇలా అల్లు అర్జున్ తో చేసిన సినిమా ఫలితం బాగా లేదు అంటే మండిపడుతున్నాడంటున్నారు.


Click it and Unblock the Notifications