హిట్టు కోసం బట్టలు విప్పి చూపక్కర్లా...కాజల్
నా దృష్టిలో గ్లామర్ పాత్ర అంటే..శరీరప్రదర్శన చేయడమే. దుస్తులు తక్కువ వేసుకుని అంగాంగ ప్రదర్శన చేయాలి. సినిమా హిట్టవ్వడం కోసమో.. కెరీర్ బాగుండడం కోసమో మొదట్లో అలాంటి పాత్రలు చేయాలని అందరూ అంటుంటారు. కానీ...నాకు అది ఇష్టం లేదు అంటోంది కాజల్. అలాగే మితిమీరిన గ్లామర్ పాత్రలకు దూరంగా వుంటాను. మొదట్నుంచీ కూడా నేను అదే సూత్రాన్ని అనుసరిస్తున్నాను. ఎక్స్‌పోజింగ్ విషయంలో నా హద్దులు నాకు తెలుసు. అందుకే ఒక పరిధి మేరకే గ్లామర్ పాత్రలు చేస్తున్నా. ఎక్కువగా నటనకు ఆస్కారమున్న పాత్రలకే నేను మొగ్గుచూపుతాను అంటూ తన మనస్సులో మాట చెప్పుకొచ్చింది కాజల్. మగధీర చిత్రంలో హాట్ గా మారిన కాజల్ ప్రస్తుతం ఎన్టీఆర్ 'బృందావనం' చిత్రంతో పాటు ప్రభాస్-దశరథ్ కలయికలో 'దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రంలో చేస్తోంది. అలాగే అజయ్ భుయాన్ దర్సకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రంలో కూడా చేస్తోంది.


Click it and Unblock the Notifications











