నిజం ఏమిటో నాకు తెలుసు..కాజల్

By Srikanya

'మీరు ఫలానా దర్శకుడి సినిమాలో నటించను అన్నారట, ఫలానా హీరోతో గొడవ పడ్డారట..' ఇలాంటి సంగతులు విన్నప్పుడు 'అలాగా, సరే... కానివ్వండి' అంటూ నవ్వేస్తున్నాను. నిజం ఏమిటో నాకు తెలిసినప్పుడు ఆ వ్యాఖ్యలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం లేదని కాజల్ చెబుతోంది. ఆమెపై ఈ మధ్య కాలంలో వరసగా రూమర్స్ రావటం,మీడియాలో ఎప్పటికప్పుడు నిలదీయటంతో ఆమె ఇబ్బందులు పడింది. మొదట్లో నేను అలా అనలేదు అంటూ మొత్తుకుంది కానీ ఆమెకు ఆ తలనొప్పి తగ్గలేదు. దాంతో ఈ నిర్ణయానికి వచ్చింది. అంతేగాక... విమర్శలకు, పొగడ్తలకు ఒకేలా స్పందించడం చాలా కష్టం. ఎంత తేలిగ్గా తీసుకొందామన్నా ఎక్కడో ఓ చోట వాటికి అధీనమైపోవల్సిందే. ఈ రెండు విషయాలకు దూరంగా ఉండాలంటే సానుకూల దృక్పథం అలవర్చుకోవాలని మానసిక వైద్యులు చెబుతుంటారు. ''మొదట్లో ఎవరైనా పొగిడితే పట్టించుకొనేదాన్ని కాదు. కానీ విమర్శిస్తే తట్టుకోలేకపోయేదాన్ని. పరిశ్రమలో ఇలాంటివి సాధారణమే అనే విషయం తరవాత తెలిసింది. కనీసం పది సినిమాల్లో నటిస్తే చాలు, ఇవి రెండూ తప్పకుండా అనుభవానికి వస్తాయి. ఇప్పుడు ఎవరేమన్నా తేలిగ్గా తీసుకొంటున్నాను అంది.

ప్రస్తుతం కాజల్... పూరీ దర్శకత్వంలో ది బిజినెస్ మ్యాన్ సినిమా కమిటైంది.అయితే ఆమె సినిమాలు దడ, వీర భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకోవటంతో ఆమె కొంత డిఫెన్స్ లో పడిన మాట మాత్రం వాస్తవం. అలాగే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏ అవకాశం వచ్చినా వదులుకోను. ఆయా పాత్రలు నచ్చకపోతే తప్ప అంది.ఆ పాత్ర మళ్లీ చేసే అవకాశం వస్తే... అదికూడా బాలీవుడ్‌లో, పైగా నా అభిమాన నటుడు హృతిక్‌కి జోడీగా.. ఇక అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. టాలీవుడ్‌తో పాటు, కోలీవుడ్, బాలీవుడ్‌లలో కూడా మంచి పేరు సంపాదించాను. ఇంకా ఇంకా ఎదగాలనేది నా డ్రీమ్. గ్లామర్ ఉన్నంతవరకూ నటించాలనేది నా అభిమతం కాదు. నటిగా కొనసాగినంత వరకూ గ్లామర్ మెయిన్‌టెయిన్ చేయాలనేది నా కోరిక. అందుకోసం శాయశక్తులా కృషి చేస్తా అని చెప్పుకొచ్చారు కాజల్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X