మహేష్, చరణ్, ఎన్టీఆర్ ల గురించి కాజల్ (ఫొటో ఫీచర్)

By Srikanya

హైదరాబాద్ : కాజల్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా గోవిందుడు అందరివాడే చిత్రంలో చేస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...రామ్‌చరణ్ కాంబినేషన్‌తో నేను చేసిన సినిమాలన్నీ ఆడాయి. అంటే మా కాంబినేషన్‌ను జనం ఇష్టపడుతున్నారు. అతనితో కలిసి మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది కాజల్. ఇంకా తను పనిచేసిన తెలుగు హీరోల గురించి వరసగా చెప్పుకొచ్చింది.

కాజల్‌ ఏ సినిమాలో నటిస్తే ఆ పాత్ర పేరు ఆమెకు ముద్దు పేరుగా మారిపోతుందంటారు. ఎందుకంటే ఆమె ఆ పాత్రలో అంతగా అల్లుకుపోతుంది మరీ. 'చందమామ' తర్వాత చందమామ కాజల్‌ అన్నా.. 'డార్లింగ్‌' సినిమాతో పేరుకు ముందు డార్లింగ్‌ అని వచ్చినా.. 'బాద్‌షా' బంతి జానకిగా మారినా ఆమెకే చెల్లింది.

అంతేనా కాజల్‌తో ఓ సినిమా చేస్తే మరోసారి కలసి నటించేందుకు మన హీరోలు కూడా ముందుకొస్తారు. అంతగా స్నేహబంధాన్ని అందింస్తుంది ఈ భామ. మరి ఆమెతో నటించిన హీరోల గురించి.. ఆమె ఏ అభిప్రాయంతో ఉందో చూద్దామా.

స్లైడ్ షోలో...కాజల్ కబుర్లు

మహేష్‌బాబు

మహేష్‌బాబు

''మహేష్‌బాబు ఒక అందమైన బుల్లెట్‌. ఆయనతో 'బిజినెస్‌మేన్‌'లో నటించాను. చాక్లెట్‌ బాయ్‌లా ఉంటూనే.. మాస్‌ అంశాలను కూడా బాగా పండిస్తారు. సెట్‌లో అందరితో బాగా మాట్లాడతారు. సినిమాకు సంబంధించిన అనేక అంశాలు ఆయన నుంచి తెలుసుకోవచ్చు. మన రాష్ట్రంలోనే కాదు విదేశాల్లోనూ అతని క్రేజ్‌ చూశాను. 'బిజినెస్‌మేన్‌' సినిమా సమయంలో 'దుబాయ్‌'లో ఓ షో చూశాను. అక్కడ వారందరూ 'మహేష్‌.. మహేష్‌..' అంటున్నారు. అప్పుడర్థమైంది మహేష్‌ మానియా''.

ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌

''తెలుగులో నాకు బాగా నచ్చిన కథానాయకుల్లో ఎన్టీఆర్‌ ఒకరు. ఇద్దరం కలసి 'బృందావనం', 'బాద్‌షా' సినిమాల్లో చేశాం. ఆయన నటన, నిజాయతి నాకు బాగా నచ్చాయి. దీంతో అన్నింటా ముందుండాలనేదే ఓ దృఢ లక్ష్యం కూడా ఉంది. అదే అతనిలో నాకు బాగా నచ్చింది. సెట్‌లోనూ, తెరపైనా ఆయన ఒకేలా ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవచ్చు. రెండు చిత్రాల్లోనూ ఆయనతో డ్యాన్స్‌ చేయడానికి చాలా కష్టపడాల్సివచ్చింది''

రామ్‌చరణ్

రామ్‌చరణ్

''టాలీవుడ్‌లో హిట్‌పెయిర్‌ అని ఎక్కువగా చెప్పుకునే జంటల్లో రామ్‌చరణ్‌-నేను ఉన్నాం. 'మగధీర', నాయక్‌', ఇప్పుడు 'గోవిందుడు అందరివాడేలే' ఇలా మా సినిమాల పరంపర కొనసాగుతోంది. తండ్రి తగ్గ తనయుడు అని ఇప్పటికే అనిపించుకున్న చెర్రీని తొలి రోజుల నుంచి చూసే అవకాశం నాకు కలిగింది. సినిమా సినిమాకీ ఎదుగుతున్నాడు.

అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌

బన్నీతో రెండు సినిమాలు (ఆర్య2, ఎవడు) చేశాను. 'ఆర్య2' సెట్‌లో మేమిద్దరం చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. 'ఎవడు'లోనూ అంతే. 'సెట్‌లో వీళ్లుంటే ఎవ్వరం ఆపలేం..' అనుకొనేవారంతా. అంతగా మేం స్నేహితులమైపోయాం.

ప్రభాస్‌

ప్రభాస్‌

''నాకు డార్లింగ్‌ అనే ముద్దు పేరు అందించిన సినిమా 'డార్లింగ్‌'. దీంతోపాటు ప్రభాస్‌లాంటి మంచి వ్యక్తిని కూడా పరిచయం చేసిన సినిమా అది. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో 'మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌' కూడా చేశాను. ఈ రెండు సినిమాల్లోనూ మా జంటకు మంచి మార్కులే పడ్డాయి. అతని గురించి చెప్పాలంటే అందగాడు, ప్రొఫెషనల్‌, పాసినేట్‌, అంకిత భావం ఉన్నవాడు.. ఇలా చాలా విశేషణాలే వస్తాయి. సెట్‌లో ఉన్నప్పుడు నటన గురించి తప్ప వేరే విషయాలు ఆలోచించని తత్వం అతనిది''

రవితేజ

రవితేజ

''రవితేజ తెరపె ప్రేక్షకుల్ని ఎలా నవ్విస్తాడో.. చిత్రీకరణ సమయంలోనూ అంతే సరదాగా ఉంటారు. పని విషయంలో నిజాయతిగా ఉంటారు. ఆయనతో 'వీర', 'సారొచ్చారు' సినిమాల్లో చేశాను. ఈ రెండింటిలోనూ నా పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. 'వీర'లో నా పాత్ర పేరు చిట్టి. ఆ పేరుకు తగ్గట్టుగానే నా నటన ఉండాలి. చిత్రీకరణ సమయంలో రవితేజను చూడటం వల్లే నా పాత్ర అంతబాగా వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X