కష్టపడి ఈ రేంజ్‌కి...రూమర్స్ పై కాజల్ మండిపాటు
అసలు ఇలాంటి రూమర్స్ ఎలా వ్యాపిస్తాయో నాకే అర్థం కావడం లేదు. నేను ఎంతో కష్టపడి ఈ రేంజ్‌కి వచ్చాను అంటూ చెప్పుకొచ్చింది కాజల్. ఎనభై లక్షల దాకా రెమ్యునేషన్ డిమాండ్ చేస్తున్న విషయాన్ని మీడియా ఆమె వద్ద ప్రస్దావిస్తే కాజల్ పై విధంగా స్పందించింది. అలాగే నేను తీసుకునే పారితోషికం నాకంటే ఇలాంటి రూమర్లు క్రియేట్ చేసేవారికే బాగా తెలుసు అనుకుంటా అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేసింది. ఇక పాత్ర నచ్చితే డబ్బు విషయంలో పెద్దగా పట్టింపు పెట్టుకోను..డబ్బు సంపాదనే ధ్యేయంగా భావిస్తే..బహుశా ఈ స్థాయికి వచ్చివుండేదాన్ని కాదేమో. నేను నటిని అయినప్పట్నుంచీ పాత్రకే తొలి ప్రాధాన్యత ఇచ్చా. ఆ తర్వాత డబ్బు కి. ఇప్పటికీ ఆ విషయంలో నా అభిమతం మార్చుకోలేదు అంటూ ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్ సరసన బృందావనం చిత్రంలో చేస్తోంది. అలాగే ప్రభాస్ సరసన దశరధ్ దర్శకత్వంలోనూ, రామ్ చరణ్ సరసన మెరుపు చిత్రంలోనూ కమిట్ అయ్యింది.


Click it and Unblock the Notifications











