జూ ఎన్టీఆర్‌తో కాజల్ ఖరారు-ముహూర్థం మార్చి 18
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో కాజల్ అగర్వాల్‌తో రొమాన్స్ చేయబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో కాజల్ పేరును అధికారికంగా కన్ ఫర్మ్ చేశారు. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి మార్చిన 18వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. ఏప్రిల్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగబోతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ స్ర్కిప్టు అందిస్తున్నారు.
జూనియర్ స్టార్ ఇమేజ్‌కు తగిన విధంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో 'బాద్ షా' అనే టైటిల్ ఫైనల్ చేశారు. అయితే ఈ విషయాన్ని చిత్రం ప్రారంభోత్సవం రోజున అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్ర ద్వారా జూ ఎన్టీఆర్-శ్రీను వైట్ల తొలిసారిగా కలిసి పని చేస్తున్నారు. దీంతో ఈ సినిమా యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా వినోదాత్మకంగా ఉంటుందనే అంచనాలు పెరిగి పోతున్నాయి.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'దమ్ము' చిత్రంలో నటిస్తున్నారు. త్రిష, కార్తీక హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ డబల్ రోల్ పోషిస్తున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











