చీప్ ట్రిక్స్ మానుకోమంటూ నిర్మాతకు సీరియస్ గా కాజల్ వార్నింగ్
ఆ సినిమాలో నేను నటించడం లేదు. నా పేరు కేవలం పబ్లిసిటీ కోసం వాడుకొంటున్నారు...అటువంటి చీప్ ట్రిక్స్ మానుకోమంటూవార్నింగ్ ఇచ్చింది కాజల్. ఆమె తెలుగులో చేసిన 'డార్లింగ్' సినిమాని కన్నడలో 'బుల్ బుల్' అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోందని ఆ సినిమా నిర్మాతలు చెప్పుకొంటున్నారు. ఈ విషయం కాజల్ దృష్టికి వెళ్లి ఆమె ఇలా స్పందించింది. అలాగే ...నేను తెలుగు, హిందీ, తమిళ సినిమాలతో ఇప్పుడు తీరిక లేకుండా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా సినిమాలు ఒప్పుకొనే అవకాశం లేదు. కన్నడలో నటించాలని ఉంది. అయితే అది ఇప్పుడే కాదని చెప్పింది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











