For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆమె అలాంటి పాత్రలు ఒప్పుకోకూడదు: కాజల్ అగర్వాల్

  By Srikanya
  |

  హైదరాబాద్ :"నాకు విద్యాబాలన్ అంటే చాలా గౌరవం. ఆమె లాంటి గొప్ప నటి డర్టీ పిక్చర్ లాంటి చిత్రాలలో పాత్రలు ఒప్పుకోకూడదు" అంటోంది కాజల్ అగర్వాల్. ఆమె తన సినీ ప్రయాణం గురించి వివరిస్తూ..డర్టీ పిక్చర్ లాంటి చిత్రాలు వస్తే చేయనని,విద్యాబాలన్ చేయటమే ఇష్టం లేదని ఖరాఖండిగా చెప్పింది. ఆమె ఈ విషయమై మరింతగా మాట్లాడుతూ...''సినిమా అంటే గ్లామర్‌ ప్రపంచం. దానికి దూరంగా వెళ్లి నటించడం కష్టమే. నాకు నేను తెరపై అందంగా కనిపించాలనుకొంటాను. నన్ను అలా చూడ్డానికే ఇష్టపడతారు'' అంది.

  ఇక ''కుటుంబం అంతా చూసేదే మంచి సినిమా. అలాంటి కథలనే ఎంచుకొంటా. ఆ పరిధి దాటి వెళ్లడానికి ఇష్టం లేదు. ఒక వేళ 'డర్టీ పిక్చర్‌' సినిమాలో నటించే అవకాశం వస్తే.. చేయలేనేమో? సిల్క్‌ పాత్రలో విద్యాబాలన్‌ని తప్పితే మరెవరినీ ఊహించలేం. దక్షిణాది భాషల్లో ఆ సినిమాని రీమేక్‌ చేయడం సాహసమే'' అని చెప్పుకొచ్చింది.

  అలాగే ''నా అందాల ప్రదర్శన ఎప్పుడూ హద్దుల్లోనే ఉంది. చిన్ని చిన్ని దుస్తుల్లోనే గ్లామర్‌ ఉంటుందని నేను నమ్మను. అవి వేసుకోకపోయినా నేను అందంగానే ఉంటాను. నిండైన చీరకట్టులో చాలా సినిమాల్లో కనిపించాను. నా అందంపై నాకెప్పుడూ సందేహం లేదు. అనుమానం ఉన్నవారే వేరే దారుల్లో ప్రయాణిస్తారు'' అంటోంది కాజల్. ఆమె ఈ మధ్య కాస్త శ్రుతి మించి మరి అందాల ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మీడియా వారు ఆమెను అడిగితే ఆమె ఇలా స్పందించింది. అలాగే ...''నీ నవ్వే నీకు అందం అని మా అమ్మ నాతో ఎప్పుడూ చెబుతుంటుంది. అమ్మ కంటికి బిడ్డలు ఎప్పుడూ అందంగానే కనిపిస్తారు. అయితే నా స్నేహితులు కూడా అదే మాట చెబుతుంటారు'' అంది కాజల్‌.

  ప్రస్తుతం కాజల్ తెలుగు,తమిళ భాషల్లో బిజీగా ఉంది. తెలుగులో 'బాద్‌షా', 'నాయక్‌', 'సారొస్తారు' సినిమాల్లో నటిస్తోంది. విజయ్ సరసన చేసిన 'తుపాకి' సినిమాతో తమిళనాట ఓ విజయం తన ఖాతాలో వేసుకొంది. అలాగే ఆమె ఓ హిందీ చిత్రం కమిటైంది. ఆ చిత్రం కాన్సెప్ట్ వాస్తవ సంఘటన నేపధ్యంలో రూపొందిస్తున్నారు. 1987 నాటి ఒక వాస్తవ ఘటన ఆధారంగా 'ఎ వెన్స్‌డే' ఫేం దర్శకుడు నీరజ్‌ 'స్పెషల్‌ ఛబ్బిస్‌' పేరిట ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ముంబైలోని త్రిభువన్‌దాస్‌ భీమ్‌జీ జువెలర్స్‌ ఒపెరా హౌస్‌ శాఖపై పట్టపగలు జరిగిన ఒక దోపిడీ ఘటన ఈ చిత్రానికి ఇతివృత్తమని తెలిసింది. సిబిఐ ఆఫీసర్‌ ముసుగులో మోన్‌ సింగ్‌ అనే వ్యక్తి 26 మంది సాయంతో ఈ దోపిడీకి పాల్పడ్డాడు. ఇక ప్రస్తుతం ఆమె తెలుగు సినిమా స్టార్ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ తేజ, పవన్‌ కళ్యాణ్ లోనూ, కోలీవుడ్‌ స్టార్స్‌ సూర్య, విజయ్‌లతో ఈ ఉత్తరాది భామ ఒక్కో సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీలోనూ ఆమె ఆచి తూచి ఆఫర్స్ ని ఎంచుకుంటోంది.

  English summary
  "A good movie is one where the whole family members can sit together and watch it. I wish all my movies come under that category" says Kajal. She also added that she didn't take up the remake of Vidya Balan's ' The Dirty Picture' when she got the opportunity only because she woudl have to do some bold scenes in the movie. "Also, I had a lot of respect for Vidya Balan who starred in the film. But i couldn't accept a great actress like her do suck kind of roles" she added.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X