వందేళ్లనాటి దాబాలో కాజల్ ఎంజాయ్(ఫొటో)
హైదరాబాద్ : చెన్నై, హైదరాబాద్ మధ్య తిరుగుతూ వరస షూటింగ్ లతో బిజీగా ఉన్న కాజల్ మధ్య మధ్య లో తన కుటుంబంతోనూ జాలీ ట్రిప్ లు వేస్తోంది. తాజాగా అలాంటిదే తన సోదరి నిషా అగర్వాల్, ఆమె భర్త కరన్ తో కలిసి వేసింది. అమృతసర్ లో ఫేమస్..దాబా కేసర్ క దాబా కి వెళ్లి అక్కడ ఫుజ్ ని టేస్ట్ చేసింది. అంతేకాకుండా ఈ అక్కా చెళ్లెళ్లు ఇద్దరు ఇలా మొబైల్ లో ఫొటో దిగారు. ఈ వందేళ్ల దాబాలో ఫుడ్ బాగుందంటూ కాజల్ ఈ ఫొటోని తన అభిమానులకు షేర్ చేసింది.

కెరీర్ విషయానికి వస్తే... కాజల్....బండ్ల గణేష్ కి వరసగా మూడోసారి డేట్స్ ఇచ్చింది. గతంలో బండ్ల గణేష్ నిర్మాతగా వచ్చిన 'బాద్‌షా'లో చేసిన ఆమె తర్వాత తెలుగులో ఇదే నిర్మాత నిర్మిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చేసింది. ఆ చిత్రం రీసెంట్ గా విడుదలైంది. ఇప్పుడు మళ్లీ ఇదే నిర్మాత నిర్మించనున్న పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్ రానున్న చిత్రం చేస్తోంది. మధ్య గ్యాప్ లో తెలుగులో ఏ ఇతర సినిమా ఒప్పుకోలేదు.
దాంతో బండ్ల గణేష్ కు ఆమె వరస డేట్స్ ఇవ్వటానికి కారణంగా... మధ్య రెమ్యునేషన్ విషయమై కుదిరిన ఒప్పందమే అని చెప్పుకుంటున్నారు. కాజల్ ...రెమ్యునేషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని, అదే ఆమె బలహీనత,బలం అని అంటారు. ఆ పాయింట్ మీద గణేష్ వర్కువుట్ చేసాడని అంటున్నారు. బయిట ఏ నిర్మాత ఆఫర్ చేయని విధంగా గణేష్ ఆమెకు రెండు కోట్లు ఇస్తున్నారని, అందుకే ఆమె వెంటనే సై అందని సమాచారం.

''పని.. పని.. పని.. జీవితమంతా ఇలాగే ఉంటే ఇక ఆనందం ఎక్కడుంటుంది. అందుకే చిత్రీకరణలో ఎంత బిజీగా ఉన్నా.. ఓ చల్లని సాయంత్రం అలా స్నేహితులతో బయటకు వెళ్లేందుకు ప్రాధాన్యమిస్తాను. వాళ్లతో మాట్లాడుకుంటూ.. చల్లని పళ్ల రసం తాగుతూ ఉంటే ఆ ఆనందమే వేరు'' అంటోంది కాజల్


Click it and Unblock the Notifications











