మెగాస్టార్ డాన్స్ ల్లోని గ్రేస్ చరణ్ సొంతం - డాన్స్ చరణ్ బ్లడ్ లో ఉంది...
డాన్స్ ల్లో చరణ్ తో ఎవరూ పోటీ పడలేరని కితాబులిచ్చేస్తోంది 'మిత్రవింద" కాజల్. 'మగధీర" సినిమాలో చరణ్ తో కలిసి స్టెప్పులేస్తోంటే చాలా భయమేసిందనీ, చరణ్ తో పోటీ పడ్డానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది కాజల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో. డాన్స్ చరణ్ బ్లడ్ లోనే వుందన్న కాజల్, మెగాస్టార్ డాన్స్ ల్లోని గ్రేస్ చరణ్ తన సొంతం చేసుకున్నాడని టాలీవుడ్ లో చరణే నెంబర్ వన్ డాన్సర్ అంటూ చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తేసింది.
చరణ్ హార్స్ రైడింగ్ చేస్తోంటే యూనిట్ సిబ్బంది షాక్ కి గురైందనీ, ఓ సందర్భంలో చరణ్ గుఱ్ఱం మీద నుండి పడిపోతాడని అంతా అనుకున్నామని, చాకచక్కంగా గుఱ్ఱాన్ని కంట్రోల్ చేయడం చరణ్ కే చెల్లిందని కాజల్ అంటోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంతా, సైనికులతో కలిసి కాజల్ సరదా సరదాగా గడిపింది. ఓ ఛానల్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వీరమరణం పొందిన సైనికులకీ, దేశం కోసం పోరాడుతోన్న సైనికులకూ తాను సెల్యూట్ చేస్తున్నాననీ, యువత సైన్యం వైపు ఆకర్షితులవ్వాలనీ, మహనీయుల్నిఇన్ స్పిరేషన్ గా తీసుకోవాలని కోరింది కాజల్.


Click it and Unblock the Notifications











