For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాజల్ ఒప్పుకోలేదు.,చిరునేవద్దన్నాడు.., కాజల్ ఒప్పుకుంది.. ఈ రెండు రోజుల్లో అసలేం జరిగింది??

  |

  అనుష్క..తమన్నా..నుంచి జాక్విలిన్ ఫెర్నాండెజ్ వరకు చాలా పేర్లే వినిపించాయి. ఒకరివెనుక ఒకరు వచ్చినట్టే వచ్చి తలా ఒక సాకు చెప్పి తప్పుకున్నారు. చిరంజీవి 150 సినిమా అనగానే అందరిలో ఉత్కంట నెలకొంటే హీరోయిన్ల గుండెల్లో రైల్లు పరుగెత్తాయి ఏజ్డ్ హీరో పక్కన చేస్తే కుర్ర హీరోలతో చేయటానికి ఉండదనే భయం తోనో..మరేదైనా కారణమో కానీ ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఆఖరికి హీరోయిన్ లేకుండానే సినిమా రెండో షెడ్యూలు లోకి వచ్చేసింది. ఇక ఇప్పుడు హీరోయిన్ ఫైనల్ అయింది..

  చిరు ప్రకటన వచ్చిన నాటి నుండి మెగాస్టార్‌‌తో జంటకట్టేదెవరన్న విషయంపై దేశ బడ్జెట్ స్థాయిలో చర్చలు జరుగుతూ వచ్చాయి. తీరా సినిమా రెండో షెడ్యూల్‌కు చేరుకున్నా నటీనటుల ఎంపిక జరుగుతుండటం పరిశ్రమ వర్గాలని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా విలన్, హీరోయిన్ ఎంపిక జరగకపోవడం. ఇటీవల అంజలా ఝవేరి భర్త తరుణ్ అరోరాని విలన్‌‌గా ఎంపిక చేసినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా కాజల్‌ని ఎంపిక చేసి హీరోయిన్‌ పాత్రపైనా క్లారిటీ ఇచ్చారు. తొలుత ఈ పాత్రకోసం పలువురు టాలీవుడ్, బాలీవుడ్ భామల పేర్లు వినిపించినా చివరికి మెగా ఫ్యామిలీ హీరోయిన్ గా ముద్ర పడ్డ కాజల్ నే ఓకే చేసారు... అయితే మూడు రోజులుగా కాజల్ భారీ రెమ్యునరేషన్ అడిగిందనీ, చిరూ వద్దన్నాడనీ రకరకాల వార్తలు వచ్చాయి... అసలు తేరవెనక ఏం జరిగిందో స్లైడ్ షో లో చూద్దాం...

  కాజల్ ఒప్పుకుంది..

  కాజల్ ఒప్పుకుంది..

  చిరు ప్రకటన వచ్చిన నాటి నుండి మెగాస్టార్‌‌తో జంటకట్టేదెవరన్న విషయంపై దేశ బడ్జెట్ స్థాయిలో చర్చలు జరుగుతూ వచ్చాయి. తీరా సినిమా రెండో షెడ్యూల్‌కు చేరుకున్నా నటీనటుల ఎంపిక జరుగుతుండటం పరిశ్రమ వర్గాలని ఆశ్చర్యపరిచింది

  కాజల్ ఒప్పుకుంది..

  కాజల్ ఒప్పుకుంది..

  హీరోయిన్ గురించి చాలా క‌స‌ర‌త్తులే చేశారు. కానీ ఎవ్వ‌రూ సెట్ట‌వ్వ‌లేదు. చివ‌రికి రామ్‌చ‌ర‌ణే చొరవ తీసుకొని కాజ‌ల్‌ని ఫిక్స్ చేశాడు. ఆమె చిరు ప‌క్క‌న న‌టిస్తున్నందుకుగానూ భారీ పారితోషికం డిమాండ్ చేసింద‌ట‌. అయినా స‌రే, చర‌ణ్ వెన‌క్కి త‌గ్గ‌కుండా ఆమె డిమాండ్ల‌న్నిటినీ ఓకే చెప్పి ఒప్పించిన‌ట్టు స‌మాచారం

  కాజల్ ఒప్పుకుంది..

  కాజల్ ఒప్పుకుంది..

  కొద్ది రోజుల క్రితమే ఈ వ్యవహారం తెరమీదికొచ్చినా రూమర్‌గానే మిగిలిపోయింది. అయితే కాజల్ ఓ తమిళ మీడియాతో తాను మెగాస్టార్ చిరంజీవితో నటిస్తున్నట్లు చెప్పిందట.

  కాజల్ ఒప్పుకుంది..

  కాజల్ ఒప్పుకుంది..

  దీంతో మెగా రీ ఎంట్రీలో కాజల్ ఎంట్రీలో ఖాయమని తెలుస్తోంది. గతంలో చిరుతో చిందెయ్యడానికి కాజల్ ఏకంగా రూ. 2.50 కోట్లను డిమాండ్ చేయడంతో మెగాయూనిట్ వెనక్కి తగ్గారని గాసిప్స్ వచ్చాయి.

  కాజల్ ఒప్పుకుంది..

  కాజల్ ఒప్పుకుంది..

  అంతే కాదు నిజానికి చిరంజీవే స్వయంగా కాజల్ ని రిజెక్ట్ చేసాడు. తనకి హీరోయిన్ గా కాజల్ మెగా స్టార్ ఫాన్స్ కి నచ్చట్లేదని చెప్తున్నారు. కాజల్ రామ్ చరణ్ తో మూడు సినిమాల్లో రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

  కాజల్ ఒప్పుకుంది..

  కాజల్ ఒప్పుకుంది..

  మగధీర, నాయక్ మరియు గోవిందుడు అందరి వాడేలే లాంటి సినిమాల్లో ఈ హిట్ పెయిర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియన్స్ కి నచ్చింది. మెగా స్టార్ కొడుకైన రామ్ చరణ్ తో రొమాన్స్ చేసిన ఇదే హీరోయిన్ మెగా స్టార్ పక్కన ఇబ్బందికరంగా ఉంటుందని ఫాన్స్ అనుకుంటున్నారు.

  కాజల్ ఒప్పుకుంది..

  కాజల్ ఒప్పుకుంది..

  కాజ‌ల్ ఇటీవ‌లే చేసిన సినిమాల‌న్నీ ఫ్లాపే. కానీ చిరంజీవి, వినాయ‌క్, చ‌ర‌ణ్‌లు ఆ విష‌యాన్ని ఏమాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా ఆమెనే ఖాయం చేశారు.

  కాజల్ ఒప్పుకుంది..

  కాజల్ ఒప్పుకుంది..

  మంచి ఫాంలో ఉందా అంటే అదీలేదు. ఇటీవ‌ల ఈమె కాలు పెట్టిన సినిమాలు వ‌రుస‌గా ఫ‌ట్ ఫ‌ట్ మ‌న్నాయి. దీంతో ఒక్క‌సారిగా బాలీవుడ్‌లోకి జంప్ చేసినా అక్క‌డ ఆశించిన ఫ‌లితం క‌నిపించ‌క‌పోగా ఎవ్వ‌రూ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఒక‌ర‌కంగా ఈ అమ్మ‌డు ఇప్పుడు ఖాళీయే.

  కాజల్ ఒప్పుకుంది..

  కాజల్ ఒప్పుకుంది..

  అయినా కూడా రెండుకోట్లు డిమాండ్ చేయటం తో షాక్ తిన్న చరణ్ కాదుపొమ్మనే వాడే కానీ ఇప్పుడు ఎవరూలేకపోవటం తో తప్పనిసరై బేరాలు మొదలెట్టాడట చివరికి ఏం చేసాడో కానీ మొత్తానికి కాజల్ ని ఒప్పించాడు...

  కాజల్ ఒప్పుకుంది..

  కాజల్ ఒప్పుకుంది..

  మరోవారం రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త షెడ్యుల్ లో కాజల్ పాల్గొనే అవకాశం ఉందని టాక్. మ‌రోవైపు విల‌న్ స‌మ‌స్య కూడా తీరిపోయింది. బాలీవుడ్ న‌టుడు త‌రుణ్ అరోరా.. చిరుకి విల‌న్‌గా సెలెక్ట్ అయ్యాడు. ఇక టైటిల్ సంగ‌తీ తేలిపోతే... చిరు 150వ చిత్రానికి అన్నీ క్లియ‌ర్ అయిపోయిన‌ట్టే.

  English summary
  Chiranjeevi’s 150th film has finally got its leading lady. Kajal Agarwal will be the leading lady of this film..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X