'విప్పేయడం గొప్పేమీ కాదు'
తన దృష్టిలో గ్లామర్ అంటే అందాన్ని వృద్ధిచేయటమే కాని బట్టలు విప్పేయడం ఏమాత్రం కాదని, పొడవు చేతుల చొక్కా వేసుకుని కూడా అందంగా కనపడవచ్చని కాజల్ అంటోంది. తన శరీరానికి అన్ని రకాల దుస్తులు నప్పుతాయని అయితే తాను మాత్రం అప్పుడప్పుడు చీరలు కట్టుకోవడానికి ఇష్టపడతానని తెలిపింది. ఒక చిత్రాన్ని అంగీకరించేముందు మంచి స్క్రిప్టు, మంచి దర్శకుడు, మంచి సహనటులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటానంటోంది. జూన్ మొదటివారంలో విడుదల కానున్న 'మగధీర' చిత్రంలో మొదటి సగభాగం ఫ్యాషన్ డిజైనర్‌గా, తరువాయి భాగంలో రాకుమారిగా నటిస్తున్నానని కాజల్ తెలిపింది. నటనలో, నృత్యంలో ఏదైనా శిక్షణ తీసుకున్నారా అని అడిగితే ప్రత్యేకించి నటనలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదని అయితే నృత్యంలో మాత్రం శిక్షణ తీసుకున్నట్లు ఆమె తెలిపింది.
రామ్ చరణ్ తో 'మగధీర', అల్లు అర్జున్ తో 'ఆర్య 2' చిత్రాలలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. చెన్నైలో పుట్టి పెరిగిన కాజల్ హీరోయిన్ కావాలనే తన కలను నిజం చేసుకునే నిమిత్తం ముంబై పయనమైంది. ఆ తరువాత తెలుగు చిత్ర పరిశ్రమకు చేరిన సంగతి మనకు తెలిసిందే. మరి తెలుగులో నటించడానికి ఇబ్బంది కలిగిందా అని అడిగితే నిజంగా ఎలాంటి ఇబ్బంది కలుగలేదంటోంది. పైగా భాష తనకు ఏమాత్రం అడ్డంకి కాదంటోంది కాజల్. 'నా డైలాగ్స్ అన్నీ ఇంగ్లీష్‌లో రాసుకుంటాను. నైపుణ్యంగల ఆర్టిస్టులతో పనిచేయడం వల్ల భవిష్యత్తు సులభతరం అవుతుంది. అలాగే, భాషలపై పట్టుసాధించడంలో నేను దిట్ట' అని అంటోంది.


Click it and Unblock the Notifications











