తప్పు నాదా? : మహేష్, సుకుమార్ లపై కాజల్ ఫైర్
హైదరాబాద్ : మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి తొలుత కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే డేట్స్ కుదరక ఆ చిత్రం నుంచి కాజల్ తప్పుకుంది. కానీ బయట మాత్రం వేరే రూమర్ చెక్కర్లు కొడుతోంది. కాజల్ కు డాన్సులు చేయడం సరిగా రావడం లేదని, అందుకే ఆమెను తీసేసారని ఆ వార్తల సారాంశం.
అయితే ఈ వార్తలపై కాజల్ తీవ్రంగా స్పందించింది. తనకు డాన్సులు రావని వస్తున్న వార్తలో నిజం లేదని, డాన్సుల గురించి తాను ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అవన్నీ అర్థం పర్థంలేని రూమర్లు అని తేల్చి చెప్పింది. ఈ సినిమా నుంచి తాను తప్పుకోవడం వెనక తన వైపు నుంచి ఎలాంటి లోపం లేదని....దర్శకుడు సుకుమార్ వల్లనే తాను తప్పుకోవాల్సి వచ్చిందని చెబుతోంది.
'ప్రస్తుతం ఓపక్క 'నాయక్', 'బాద్ షా', 'సార్ వచ్చారు' చిత్రాలతో బిజీగా వున్నాను. మరోపక్క సుకుమార్ సినిమా షెడ్యూలు అనుకున్నట్టుగా జరగలేదు. కేన్సిల్ అయింది. అలాంటప్పుడు ఆ సినిమాకు బల్క్ డేట్స్ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వను? అందుకే, ఆ ప్రాజక్టు నుంచి తప్పుకున్నాను. ఇందులో నా తప్పేముంది?' అని ప్రశ్నిస్తోంది.
వాస్తవానికి మహేష్-సుకుమార్ మూవీ షెడ్యూల్ కేన్సిల్ కావడానికి మహేష్ బాబు కూడా పరోక్షంగా కారణం అయ్యాడు. మహేష్ బాబుకు కూతురు పుట్టడంతో కొంత కాలం పాటు షూటింగులకు బ్రేక్ ఇచ్చాడు. ఈ విషయాన్ని కాజల్ ఎత్తి చూపక పోయినా.....షెడ్యూల్ కేన్సిల్ కావడం వల్లనే తాను తప్పుకున్నా అంటూ ఆమె పరోక్షంగా మహేష్ బాబును కూడా టార్గెట్ చేసింది.


Click it and Unblock the Notifications











