టాప్ లెస్ అన్నందుకు మీడియాను బుకాయించిన కాజల్..!
టాలీవుడ్ లో, కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపోయిన కాజల్ ఈమద్య 'సింగం"తో బాలీవుడ్ లో కూడా ఎంటర్ అయింది. ఇంత బిజీగా ఉన్న కాజల్ ఎఫ్ హెచ్ ఎం మ్యాగజైన్ కవర్ పేజీ మీద టాప్ లెస్ గా దర్శనిమివ్వడం పెద్ద దుమారం లేపింది. అన్ని పేపర్లో, వెబ్ సైట్స్ లో టివి ఛానల్స్ లో దీన్ని బాగా హైలైట్ చేశారు. ఈ వ్యవహారమంతాకాజల్ కి చిరాకు పుట్టించిందట. టాప్ లెస్ గా కవర్ పేజీకి ఫోజ్ ఇస్తే మాత్రం ఇంత రాద్దాంతం చెయ్యాలా అంటూ మీడియాపై కస్సు బుస్సు మంటోంది.
ఇలా టాప్ లెస్ గా ఫోజులిచ్చింది తనొక్కతే కాదని, చాలామంది టాప్ హీరోయిన్లు ఎఫ్ హెచ్ ఎం కవర్ పేజీలపైకి ఎక్కారని నొక్కి చెప్తోంది. హీరోయిన్ గా తాను చాలా బిజీగా ఉన్నానని, పబ్లిసిటీ తనకి అవసరం లేదని ఈ భామ నమ్మబలుకుతోంది. అయితే బాలీవుడ్ వర్గాలు మాత్రం దీనికి భిన్నంగా కథనాలు అల్లుతున్నాయి. 'సింగం" సినిమాలో హీరోయిన్ గా చేసిన కాజల్ బాలీవుడ్ లో మరిన్ని ఛాన్సులు కొట్టేయ్యడానికే ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తోందని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











