కాజల్ కోసం స్టేజిపైకి వెళ్లిన రానా.. రాధ లేనిదే జోగేంద్ర లేడు!
గత ఏడాది రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని అంత త్వరగా మరచిపోలేము. ఆ చిత్రంలో రాజకీయ నాయకుడిగా ప్రతి సన్నివేశంలో వైవిద్యం ప్రదర్శిస్తూ రానా నటించిన తీరు అద్భుతం. చాలా కాలం తరువాత ఈ చిత్రంతో దర్శకుడు తేజ విజయాన్ని అందుకున్నాడు.
అదే సమయంలో రాధ పాత్రలో కాజల్ నటన కూడా అద్భుతమే. భావోద్వేగమైన సన్నివేశాల్లో కాజల్ చాలా బాగా నటించింది. ప్రస్తుతం జరుగుతున్న సైమా అవార్డ్స్ లో కాజల్ అగర్వాల్ నటించిన రాధ పాత్రకి ఉత్తమ నటిగా అవార్డు లభించింది.

ఈ వేడుకకు కాజల్ హాజరు కాకపోవడంతో ఆమె తరుపున రాజా అవార్డు అందుకున్నాడు. స్టేజిపై నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో డైలాగ్ చెప్పి అలరించాడు. నా పేరు రాధా జోగేంద్ర.. రాధ లేనిదే జోగేంద్ర లేడు అంటూ డైలాగ్ తో అలరించాడు. థాంక్యూ మై స్వీట్ జోగి అంటూ కాజల్ అగర్వాల్ ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











