ఇలియానా పోయె...కాజల్ వచ్చె...
కొత్తొక వింత పాతొక రోత అన్న సామెత సినీపరిశ్రమలో కథానాయికల విషయంలో ఖచ్చితంగా సరిపోతుంది.కొత్త నీరొచ్చి పాత నీరు కొట్టుకు పోయినట్టుగా, కొత్త హీరోయిన్ల రాకతో పాత హీరోయున్లు కొట్టుకుపోవడం చిత్ర పరిశ్రమలో సర్వ సాధారణం.
మొన్న శ్రియ హవా సాగినా ఇలియానా ఎంట్రీతో, శ్రియ కోలీవుడ్ కు వలసపోయింది. నిన్న ఇలియానా చిత్రపరిశ్రమను ఏలినా...నేడు అంతా కాజల్ మయం. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం ద్వారా తెరంగేట్రం చేసిన కాజల్‌కు, కృష్ణవంశీ చందమామ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఇటీవలే విడుదలై, రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న మగధీర చిత్రంలో రామ్ చరణ్ కు ధీటుగా అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్య-2 లో, శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ కథానాయకుడుగా నటిస్తున్న గణేష్ చిత్రంలో నటిస్తున్న కాజల్ యువకథానాయకుడు రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం కొట్టేసింది.ఈ చిత్రాలే కాకుండా కాజల్ కాల్షీట్స్ కేటాయించగలిగితే మరో నాలుగైదు భారీ చిత్రాలు ఆమె కోసం ఎదురు చూస్తున్నాయని వినికిడి!
కాజల్ ఎంతవరకు తన హవా కొనసాగిస్తుందో చూడాలి. పనిలో పని మనం కూడా కాజల్ కు All the best చెప్పేద్దామా. ఆల్ ద బెస్ట కాజల్.


Click it and Unblock the Notifications











