మహేష్ నేనూ లవర్స్ మి కాబట్టే...
సినిమాలో నేను, మహేష్ లవర్స్ మి కాబట్టి ఆ సీన్ పెట్టారు. పైగా ఆ సీన్‌ని 'ఈస్తటిక్'(కళాత్మకం)గా చిత్రీకరించారు అంటోంది కాజల్. ఆమె తన తాజా చిత్రం 'బిజినెస్‌మేన్'లో లిప్ లాక్ కిస్ చేసారు. దాని గురించి మీడియావారు అడిగితే ఇలా స్పందించింది. అలాగే..ఆ సీన్ గురించి పర్టిక్యులర్‌గా ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడంలేదు. ప్రేమికుల మధ్య ఇలాంటివి సహజం. ఇంకో విషయం ఏంటంటే.. నేను ఏ సీన్ చేసినా నా ఫ్యామిలీ మెంబర్స్‌ని దృష్టిలో పెట్టుకుంటాను. వాళ్లు ఇబ్బందిపడతారనిపిస్తే చెయ్యను. ఈ సీన్‌లో నాకెలాంటి అభ్యంతరం అనిపించలేదు కాబట్టి చేశాను అంది.ఇక ఈ చిత్రంలో నేను ఆర్టిస్ట్‌గా (చిత్రకారిణి)గా యాక్ట్ చేశాను. చిన్నప్పుడు ఇష్టపడి బొమ్మలు గీసేదాన్ని. గోడల మీద బొమ్మలు గీసి అమ్మతో చివాట్లు తిన్న సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమా చేస్తున్నప్పుడు అవన్నీ గుర్తొచ్చాయి. ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో 'గాళ్ నెక్ట్స్ డోర్' అనిపించే పాత్రలు చేశాను. కానీ ఈ సినిమాలో చాలా ట్రెండీగా, స్టయిలిష్‌గా కనిపిస్తాను. ఓవరాల్‌గా 'చిత్ర' పాత్రను బాగా ఎంజాయ్ చేశాను. పూరి జగన్నాథ్ ఎంత క్రమశిక్షణగా ఉంటారో అంతే స్నేహంగా ఉంటారు. తనకు కావాల్సింది ఆర్టిస్టులకు క్లియర్‌గా చెప్పి చేయించుకుంటారు అంది. ఇక తాను ప్రస్తుతం 'మాట్రాన్, తుపాకీ' చిత్రాల్లో చేస్తున్నానని, తెలుగు, తమిళ భాషల్లో అవి రూపాందుతున్నాయని కాజల్ చెప్పారు. తెలుగులో రామ్‌చరణ్ సరసన ఒక సినిమా, ఎన్టీఆర్‌తో ఒక సినిమా అంగీకరించానని, త్వరలో హిందీలో ఓ సినిమా సైన్ చేయబోతున్నానని చెప్పింది.


Click it and Unblock the Notifications











