నాలుగేళ్ల ఏళ్ల క్రితం నుంచి మహేష్ బాబుతో... కాజల్
కాజల్ రీసెంట్ గా మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందనున్న 'ది బిజినెస్ మ్యాన్"కమిటైన సంగతి తెలిసిందే.ఈ విషయమై ఆమె చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది.ఆమె మాట్లాడుతూ..తెలుగులో మొదటి చిత్రం 'లక్ష్మీ కళ్యాణం" అంగీకరించినప్పుడు నేను ఇక్కడ చూసిన మొట్టమొదటి చిత్రం 'పోకిరి". ఆ సినిమా చూసిన తర్వాత మహేష్‌బాబు సరసన హీరోయిన్‌గా చేయాలని, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశం వస్తే బాగుంటుందని అనుకున్నాను. అయితే ఇద్దరి కాంబినేషన్ ఒకే సినిమాకి కుదరడం ఇంకా ఆనందంగా ఉంది. ఎప్పుడో నాలుగైదేళ్ల క్రితం ఏర్పడిన కోరిక ఇప్పుడు నెరవేరుతోంది అంటూ ఆనందంగా చెప్పుకొచ్చింది. అలాగే మహేష్ ప్రక్కన చేయాలనే తన కోరక తీరటానకి నాలగేళ్ళ సమయం పట్టిందని చెప్పింది.


Click it and Unblock the Notifications











