ఎప్పుడైనా మహేష్ పెదవి విప్పితే.. కాజల్
మహేష్ బాబుతో తొలి సారి నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది.సెట్లో ఎక్కువగా మాట్లాడరు. ఎప్పుడైనా పెదవి విప్పితే అక్కడా సినిమా విషయాలే ఉంటాయి. చిన్న చిన్న సూచనలు చెబుతుంటారు. అవి నాకెంతో ఉపయోగపడ్డాయి అంటోంది కాజల్. ఆమె ప్రస్తుతం మహేష్‌తో కలిసి 'బిజినెస్ మేన్'లో నటిస్తోంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం.. కొనుగోళ్ళు.. అమ్మకాల చుట్టూ తిరగనుంది. ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేస్తున్నారు. గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక కాజల్ తెలుగులో రామ్ చరణ్, వివి వినాయిక్ ల కాంబినేషన్ లో రూపొందే చిత్రం కూడా కమిటైంది.జనవరి నుంచి ఆ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. ఆగస్టులో రిలీజవుతుంది.సమంత దూసుకుపోవటంతో కాస్త కాజల్ దూకుడు తగ్గింది.


Click it and Unblock the Notifications











