నాగచైతన్య తో కలిసి బ్యాంకాక్ చెక్కేస్తున్న గ్లామర్ డాల్...!
గ్లామర్ డాల్ కాజల్ అగర్వాల్ యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ సరసన మిస్టర్ పర్ ఫెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. కాగా నెక్ట్స్ 'కబడ్డీ చిట్టి'గా రానుంది. సక్సెస్ హీరో క్రేజీ రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తన క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుందని ఆనందపడుతోంది. టాలీవుడ్‌లో నెంబర్ 1 నువ్వేనా అని అడిగితే... ఆ నెంబర్లు గురించి నాకు తెలియదు. వచ్చిన ప్రాజెక్టు మంచిదో కాదో చూసుకుని నటించుకుంటూ పోతూ ఉంటాను. ఇంతకముందు చిత్రాల్లో లవర్ గాళ్ గానే కనిపించాను. ఇపుడు అల్లరి పిల్లగా కనబడబోతున్నాను అని సెలవిచ్చింది. తన చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయని అంటోంది. ఒకటి వీర కాగ మరొకటి నాగచైతన్యతో కలిసి నటించబోతోంది. ఈ మూడు చిత్రాలో ఈ సంవత్సరంలోనే విడుదలకాబోతున్నాయి.
ప్రస్తుతం, నాగ చైతన్య, కాజల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగు ఏప్రిల్ రెండు నుంచి బ్యాంకాక్ లో జరుగుతుంది. కామాక్షి ఎంటర్ ప్రైజస్ బ్యానర్ పై అజయ్ భూయాన్ దర్శకత్వంలో శివప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు అక్కడ జరిగే లాంగ్ షెడ్యుల్ లో ప్రధాన తారాగణం పాల్గొనే ముఖ్య సన్నివేశాలను, హీరో హీరోయిన్లపై ఓ పాటను కూడా చిత్రీకరిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. కాగా తమిళంలోనూ అవకాశాలు వస్తున్నాయనీ, అయితే తన ప్రాధాన్యం టాలీవుడ్ కేనని చెపుతోందీ ముద్దుగుమ్మ. నిలబెట్టిన పరిశ్రమను మరువకూడదు కదా.


Click it and Unblock the Notifications











