హాట్ గర్ల్ కాజల్ సినిమా విడుదల భయంతో అన్ని వెనక్కి...
సూర్య, అనుష్క కాంబినేషన్ లో వచ్చిన తమిళ సింగం(యమడు) చిత్రం రీమేక్ లో కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తలిసిందే. గోల్ మాల్ వంటి సూపర్ హిట్ చిత్రం రూపొందించి హాట్ డైరక్టర్ గా మారిన రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొంది విడుదలకు రెడీ అయ్యింది..అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న ఈ సినిమాకు పోటీగా బాలీవుడ్ లో ఏ సినిమానూ రిలీజ్ కు పెట్టుకోవటం లేదు. 'సింగం' జులై 22న బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. దీంట్లో బాజీరావ్ సింగమ్ అనే పాత్రలో అజయ్ కనిపిస్తారు.
ఆ సినిమా విడుదలైన మూడో వారం వరకూ ఏ సినిమాను విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సిద్ధంగా లేరని వినపుడుతోంది. ఇదే రోజున షాహిద్ కపూర్, సోనమ్ కపూర్ నటించిన 'మౌసమ్' చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యంగా జరుగుతుండడంతో వాయిదా వేశారని చెబుతున్నారు. ఇంకొందరు నిర్మాతలేమో 'సింగం' మూలంగా తమ చిత్రాల్ని వాయిదా వేసుకుంటున్నామని ప్రకటించారు.


Click it and Unblock the Notifications











