ఇలియానా..కజోల్ ఎవరికి ఓటు?
ప్రభాస్, దశరధ్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించనున్న చిత్రానికి హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. రేస్ లో ఇలియానా, కాజల్ ఉన్నట్లు సమాచారం. ప్రభాస్ తన మున్నా చిత్రంకి పనిచేసిన ఇలియానాకే ఓటు వేస్తున్నట్లు సమాచారం. అయితే దశరధ్ మాత్రం కాజల్ కి ఉన్న క్రేజ్ క్యాష్ చేసుకోవటం మేలని సూచిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం పూర్తయ్యి రిలీజ్ అయ్యే సమయానికి రామ్ చరణ్ తో చేస్తున్న మగధీర చిత్రం విడుదల అవుతుందని,కాజల్ స్టార్ హీరోయిన్ అవుతుందని, అది తమ చిత్రంకి బాగా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.అయితే దిల్ రాజు మాత్రం ఏ హీరోయిన్ ని పెట్టుకున్నా ఓకే కాని ప్రకాష్ రాజ్ ని మాత్రం వదలకూడదని చెప్తున్నారని చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం హీరోయిన్ల రెమ్యునేషన్స్, డేట్స్ ని బట్టి బేరసారాలు జరుగుతున్నాయి. ఇక దశరధ్ సంతోషం తప్ప హిట్ చిత్రాలు లేవని, శ్రీ యాక్షన్ చిత్రం చేద్దామని బోల్తా కొట్టాడని, అతను ప్రభాస్ వంటి యాక్షన్ హీరోని డీల్ చేయగలడా అని కొందరు సందేహం వెళ్ళబుచ్చుతున్నారు. అయితే స్క్రిప్టు అధ్బుతుంగా వచ్చిందని దిల్ రాజు తన శ్రేయాభిలాషులతో చెప్పారని సమాచారం. ఇక ప్రస్తతం ప్రభాస్ ఫ్లాప్ బిల్లాని ప్రమోటే చేస్తూ, ఏక్ నిరంజన్ షూటింగ్ లో పాల్గోంటున్నారు. ఇలియానా నితిన్ సరసన మిర్చి చిత్రంలోనూ, విష్ణు సరసన సలీం చిత్రంలోనూ చేస్తోంది. చూద్దాం ఎవరిని ఈ అదృష్టం వరించనుందో ..


Click it and Unblock the Notifications











