ప్రభాస్ డార్లింగ్ ఆమే?

By Staff

Kajal
ప్రభాస్, కరుణాకర్ కాంబినేషన్లో రానున్న డార్లింగ్ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ ని ఎంపికచేసినట్లు సమాచారం. భిల్లా అనంతరం ప్రభాస్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఏక్ నిరంజన్' షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ చిత్రం అనంతరం డార్లింగ్ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే దశరధ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే చిత్రం కూడా వరసలో ఉండటంతో డేట్స్ ఎడ్జెస్టమెంట్ ఉంటుందని అంటున్నారు. ఇక కరుణాకర్ తొలిప్రేమ తర్వాత చెప్పుకోతగ్గ హిట్టు ఇవ్వలేదు. అయితే ఈ డార్లింగ్ స్క్రిప్టు అద్బుతంగా వచ్చిందని ఇదో డిఫెరెంట్ లవ్ స్టోరీ అని చెప్తున్నాడు.

అలాగే కాజల్ 'లక్ష్మీకల్యాణం' తో తెరంగ్రేటం చేసి కృష్ణవంశీ 'చందమామ' తో బ్రేక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన 'మగధీర' చిత్రం రిలీజుకు రెడీగా ఉంది. అలాగే అల్లు అర్జున్ తో 'ఆర్య-2' చిత్రంలోనూ కాజల్ నటిస్తోంది. ఈ రెండు చిత్రాల తర్వాత కాజల్ నెంబర్ వన్ రేసులో యువతరం హీరోయిన్లకు గట్టిపోటీ ఇవ్వనుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే 'మగధీర' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా ఉన్న బివిఎస్ఎన్ ప్రసాద్ 'డార్లింగ్' హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని ప్రభాస్ తో గతంలో 'ఛత్రపతి' వంటి సెన్సేషన్ హిట్ చిత్రాన్ని అందించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ తన శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు. డార్లింగ్ అనేది ప్రభాస్ ఊతపదం. దీన్ని బుజ్జిగాడు మేడిన్ చెన్నైలో పూరీ ఉపయోగించి మాస్ ని ఆకట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X