ఎవరితోనూ గొడవలు పడను అంటున్న డార్లింగ్
కాజల్‌కు కోపం వచ్చిందట. ఆ కోపానికి బలీయమైన కారణమే ఉందట. వివరాల్లోకెళితే... టాలీవుడ్‌లో వీరలెవల్లో దూసుకుపోతున్న తమన్నాను చూసి కాజల్ కుళ్లుకుంటోందని, తమన్నా సెకండ్ ఇన్నింగ్స్ కాజల్, అనుష్కల గుండెల్లో రైళ్లు పరుగెత్తేట్లు చేస్తోందని ఇటీవల కొన్ని వెబ్‌సైటుల్లో కథనాలు వెలువడ్డాయట. కాజల్ మనస్తాపానికి కారణం అదే. దాంతో ఎప్పుడూ నవ్వుతూ ఉండే కాజల్ తొలిసారి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
ఈ విషయం గురించి కాజల్ స్పందిస్తూ -''పోటీ ఉంటేనే ఏ ప్రొఫెషన్‌లో అయినా మజా. పోటీ అనేది ఎదుగుదలకు కూడా కారణం అవుతుంది. చిత్ర పరిశ్రమలో ఈ పోటీ వాతావరణం ఇంకాస్త ఎక్కువ. ఎంతమంది కొత్త కథానాయికలు వస్తే... అంత కష్టపడి పనిచేసే అవకాశం దొరుకుతుంది. పరిశ్రమ విజయాలతో కళకళలాడాలి. నా కెరీర్‌లో నేను ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేయాలి. ఇది నా అభిమతం. నా వరకు నేను అలాగే ఆలోచిస్తాను. కానీ వెబ్‌సైట్స్‌లో నా అభిమతానికి భిన్నంగా రాసి నా మనసును గాయపరిచారు.
నేను ఒక్కటే చెబుతున్నాను. ఒకర్ని చూసి కుళ్లుకోవడం, ఇతరులతో అనవసరంగా గొడవలు పెట్టుకోవడం నాకు తెలీని విషయాలు. నన్ను మా ఇంట్లో వాళ్లు అలా పెంచారు. మరోసారి ఇలాంటి పనికిమాలిన కథనాలను రాయొద్దు"" అంటూ ఘాటుగా స్పందించారు. ఇంకా మాట్లాడుతూ-''పరిశ్రమలో ఎంత పోటీ ఉంటుందో, అంత ఫ్రెండ్లీ వాతావరణం కూడా ఉంటుంది. అనుష్క నా క్లోజ్ ఫ్రెండ్. అలాగే త్రిష నటన అన్నా, ఇలియానా గ్లామర్ అన్నా నాకిష్టం. తమన్నాతో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మా మధ్య పోటీ ఉన్నా అది ఆరోగ్యవంతమైనదే. ఇది గ్రహిస్తే మంచిది"" అని ముగించారు కాజల్.


Click it and Unblock the Notifications











