twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బికినీ వేస్తావా, జీరో సైజ్‌లో కనిపిస్తావా...?’

    By Sindhu
    |

    ఉత్తరాది తెరపై జీరోసైజ్‌, బికినీ అవతార్‌ చాలా సాధారణ విషయం. దక్షిణాదినుంచి వెళ్లే ఏ తారకైనా ఇది కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే అయినా..అక్కడికెళ్లాక రాజీకి రాక తప్పదు. అలా కాదని…భీష్మిస్తే..ఫలితం కూడా అలానే ఉంటుంది! పైగా ఓ దక్షిణాది తార అంటే హిందీతెరకు ఆదిలోనే చిన్నచూపు. త్రిష, అసిన్‌, శ్రీయ…వీరంతా అపుడో ఇపుడో..ఆ అహంకారాన్ని ఎదుర్కొన్నవారే! తాజాగా వీరి జాబితాలోకి కాజల్‌ చేరబోతోంది. ఇటీవల ఓ సమావేశంలో పాత్రికేయులు 'బికినీ వేస్తావా, జీరో సైజ్‌లో కనిపిస్తావా?" అని ప్రశ్నిస్తే కచ్ఛితంగా అలా కనిపించను..నేనింకా 10 సినిమాల చిన్నారినే..అని కరాఖండిగా చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.

    దీనిని బట్టి ఇక కాజల్‌కు అక్కడ అష్ట కష్టాలు తప్పవనే అర్థమవుతోంది. అయినా..దక్షిణాది సినిమాలతో బిజీ అయిన కాజల్‌ ఇక్కడి సంస్కృతిని బానే వంటపట్టించుకుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాది జనుల అభీష్టం మేరకు జీరోసైజ్‌కి దిగి..ఆపై బికినీ వేస్తుందో..లేదో అనే మీమాంశ పరిశ్రమ వర్గాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం కాజల్‌ 'సింగం" రీమేక్‌లో అజయ్‌దేవ్‌గన్‌ సరసన హిందీలో నటిస్తోంది. అదేగాక.. సూర్య సరసన కె.వి.ఆనంద్‌ దర్శకత్వం వహించే తమిళ సినిమాలోనూ నటిస్తోంది. నాగచైతన్యతో 'దడ" ఆగస్టు 12న విడుదలవుతోంది.

    English summary
    Kajal Agarwal who has been ruling the roost in the southern circuit is gearing up to arrive with her debut Bollywood venture ‘Singham’. While she is excited about pairing up with the famous Ajay Devgan, sources from Mumbai reveal about Kajal’s stand on sporting a bikini and doing a lip lock sequence.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X