స్టార్ హీరోలు, డైరక్టర్లు, ప్రొడ్యూసర్స్, హీరోయిన్స్, అందరి కళ్ళు కాజల్ పైనే..!
టాలీవుడ్ లో ఫుల్ సక్సెస్ లో వున్న హీరో యిన్ ఎవరంటే… ఇప్పుడు కచ్చితంగా కాజల్ పేరే చెప్పాలి. ఎందుకంటే, మగధీర తర్వాత స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ చిన్నది ఆ తర్వాత డార్లింగ్, బృందావనం చిత్రాలతో ఇతర హీరోయిన్లకు పోటీనిచ్చే స్థాయికి ఎదిగింది. తాజాగా 'మిస్టర్ పెర్ ఫెక్ట్' సినిమాకి ఫ్యామిలీల నుంచి మంచి రెస్పాన్స్ ఉండడంతో, ఇక కాజల్ కి తిరుగులేదంటున్నారు. ఓపక్క అనుష్క రేంజ్ పడిపోవడం, త్రిష, ఇలియానా సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇప్పుడు కాజల్ కి 'నెంబర్ వన్" హీరోయిన్ స్థానాన్ని ఇచ్చేస్తున్న వాళ్లూ వున్నారు. దీంతో, అప్పుడే తన పారితోషికం కూడా కాజల్ పెంచిందని చెప్పుకుంటున్నారు.
ఇక కోలీవుడ్ లో కూడా ఈ పెద్ద కళ్ళ సుందరికి బాగానే వుంది. త్వరలో విడుదల కాబోయే 'మగధీర" తమిళ డబ్బింగ్ 'మావీరన్" కూడా అక్కడ హిట్ అయితే, ఇక తనకి ఇటు టాలీవుడ్.. అటు కోలీవుడ్ లలో తిరుగుండదు. అనుష్క, ఇలియానా, తమన్నాల వంటి హీరోయిన్లు ఇప్పుడు తమ దృష్టినంతా అందుకే కాజల్ పై పెట్టారు. మిస్టర్ పెర్ ఫెక్ట్ సినిమా రిజల్ట్ ఏమిటంటూ, సినిమా రిలీజ్ అయినప్పటినుంచీ వీళ్లు తమ సన్నిహితులకు ఫోన్లు చేస్తూ ఎంక్వయిరీ చేస్తున్నారట. ఏమైనా, తన సాటి హీరోయిన్లు కుళ్ళుకునేలా కాజల్ సక్సెస్ పొందడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా వుంది.


Click it and Unblock the Notifications











