కాజల్ తో అన్ని విధాలా బాగా వర్క్ అవుట్ అయింది: రెబల్ స్టార్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో దశరథ్ దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 13 నుంచి పొల్లాచ్చిలో 10 రోజుల పాటు ఒక పాటను చిత్రీకరించనున్నారు. కాజల్, తాప్సీ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ ను గత చిత్రాలకుంటే గెటప్ పరంగా, క్యారెక్టరైజేషన్ పరంగా చాలా డిఫరెంట్ గా చూపించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు దశరథ్. అతని ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
డార్లింగ్ తర్వాత మళ్ళీ కాజల్ తో కలిసి నటిస్తున్న ప్రభాస్ తమ కాంబినేషన్ ఈ సారి కూడా బాగా వర్కవుట్ అవుతుందని చెప్తున్నాడు. ఇటీవల వరస పరాజయాలతో విసుగెత్తిన దిల్ రాజు ఈ సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. సంతోషం తర్వాత మళ్ళీ హిట్టు చూడని దశరథ్ ఈసారైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.


Click it and Unblock the Notifications











